Meloni rolls eyes at Macron: ఇటలీలో జరిగిన G7 సదస్సుకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ హాజరయ్యారు. అయితే..కొద్ది రోజులుగా ఇటలీ, ఫ్రాన్స్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నిజానికి ఈ గొడవ ఇప్పటికి కాదు. ఎన్నో ఏళ్లుగా అది నడుస్తూనే ఉంది. భారత్ పాకిస్థాన్‌లా అదో ఎడతెగని పంచాయితీ. అయితే...G7 సదస్సుకి వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. ఎప్పుడైతే మేక్రాన్ వచ్చారో వెంటనే ఆమె ముఖం మారిపోయింది. అప్పటి వరకూ నవ్వుతూ ఉన్న మెలోని ఒక్కసారిగా ఎక్స్‌ప్రెషన్ మార్చారు. మేక్రాన్ వచ్చి పక్కన ఉన్న నేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. వాళ్లను పలకరించి నవ్వుతూ మాట్లాడారు. మేక్రాన్ వాళ్లతో మాట్లాడుతున్నంత సేపూ మెలోని మేక్రాన్‌ని చాలా సీరియస్‌గా చూశారు.

Italy's Giorgia Meloni can't hide her contempt for Macron 🤣pic.twitter.com/Rk4bhBzJkO

— Dr. Eli David (@DrEliDavid) June 14, 2024

ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి అని షేక్ హ్యాండ్‌ ఇచ్చారు. అప్పుడు కూడా తెచ్చి పెట్టుకున్న నవ్వుతో మేక్రాన్‌ని పలకరించారు మెలోని. ఆ తరవాత మేక్రాన్ అక్కడి నుంచి వెళ్లిపోయాక కూడా అదే ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్నారు. ఈ క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఇటలీ ఫ్రాన్స్ మధ్య రిలేషన్ ఎలా ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ" అంటూ పలువురు ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్ అయ్యేలా వీడియో జూమ్ చేసి రికార్డ్ చేసి ఈ వీడియోలనే షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.