MLA Peddireddy :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీలక పాత్ర నిర్వహించిన  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన తొలి సారి నియోజకవర్గంలో పర్యటించాలని అనుకున్నారు. ఈ మేరకు అనుచరులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఆయన పుంగనూరు రావాల్సి ఉంది. కానీ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ఆయన పర్యటనను రద్దు చేసుకున్నారు. 


పెద్దిరెడ్డి పుంగనూరు రావొద్దని నిరసనలు                                


పుంగనూరులో పెద్దిరెడ్డి పర్యటనను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయనకు పదవిలో ఉండే అర్హత లేదని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కూడలి నుంచి ఇందిర కూడలి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మధ్యలో ఓ వైసీపీ నాయకుడి ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. తమ ఇంటిపై దాడి చేశారని వైసీపీ నేత ఆరోపిస్తూ ఆస్పత్రిలో చేరారు. ఇలాంటి సమయంలో పెద్దిరెడ్డి నియోజకవర్గానికి వస్తే ఇంకా ఎక్కవ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో ఆయన ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.            


జగన్‌కు గ్రేటర్ అధికారుల షాక్ - ఇంట్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత


గతంలో ఎవర్నీ అడుగు పెట్టనీయని పెద్దిరెడ్డి


నిజానికి పుంగనూరు నియోజకవర్గాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దుర్బేధ్యంగా మార్చుకున్నారు. ఆయనను కాదని ఎవరూ చిన్న ర్యాలీ కూడా నిర్వహించలేరు. అలా చేస్తే దాడులు జరుగుతాయి. టీడీపీ వాళ్లు అయినా..  బోడె రామచంద్రయాదవ్ కు చెందిన వారు ఎవరైనా సరే .. నియోజకవర్గంలో ఎక్కడా ర్యాలీలు  నిర్వహించే  పరిస్థితి కూడా ఉండదు.  చంద్రబాబు అరెస్టు సమయంలో ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు టీడీపీ కార్యకర్తలు సైకిల్ పై కుప్పం వెళ్తూంటే.. పుంగనూరులో వాళ్లతో చొక్కాలు విప్పదీయించి.. పంపించారు మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు. అలాంటి ఎంతో మందిపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అలాంటి చోట పెద్దిరామచంద్రారెడ్డి అధికారం కోల్పోవడంతో ఆయన కూడా పర్యటించలేని పరిస్థితికి వచ్చింది.                        


అమరావతి పట్టాలెక్కడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా ? నిపుణులేం చెబుతున్నారు ?


గతంలో చంద్రబాబుపై రాళ్లదాడి                       


గతంలో చంద్రబాబు చిత్తూరు పర్యటనకు వెళ్లినప్పుడు మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు నియోజకవర్గంలో రాళ్ల దాడి జరిగింది.  అక్కడి నుంచి పుంగనూరుకు వస్తున్న సమయంలో నగరంలోకి ఎంటర్ కాక ముందే ఆయనపై పెద్ద ఎత్తున దాడికి ప్రయత్నించారు. పోలీసులు కూడా పట్టించుకోకపోవడంతో టీడీపీ కార్యకర్తలు తిరగబడ్డారు. పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ ఘటన తర్వాత వందల మంది టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఆ కోపం అంతా ఉంటుందని... నియోజకవర్గానికి రాకపోతేనే మంచిదని ఆయనకు పార్టీ నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది.