MEA Condemns Brutality on PoK Protests: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ప్రజలపై పాక్ బలగాలు చేపడుతున్న హింసపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా స్పందించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లో ఇటీవల జరిగిన హింసను భారత్ తీవ్రంగా ఖండించింది, ఇస్లామాబాద్‌ను "భయంకరమైన" మానవ హక్కుల ఉల్లంఘనలుగా అభివర్ణించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. దానికి జవాబుదారీగా పాకిస్తాన్ ను చేయాల్సిందేనని పిలుపునిచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు. "పాకిస్తాన్ దళాలు అమాయక పౌరులపై చేసిన క్రూరమైన చర్యలతో సహా పీవోకేని అనేక ప్రాంతాలలో నిరసనలు జరిగినట్లు మేము చూశాము. ఈ అశాంతి ఈ ప్రాంతం పట్ల , పాకిస్తాన్ అణచివేత విధానాన్ని బయట పెట్టిందన్నారు "
పీవోకేలో వారం రోజులుగా తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. అశాంతికి కేంద్రంగా పీవోకేలోని ప్రాంతాలు మారాయి. భద్రతా దళాలు ఆందోళనకారుల్ని తీవ్రంగా హింహిస్తున్నాయి. భారీగా ప్రాణనష్టం సంభవిస్తోంది. దీంతో ప్రజలు మరింత ఆవేశానికి గురవుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కాల్చి చంపిన ముగ్గురు యువకుల అంత్యక్రియలకు వేలాది మంది హాజయ్యారు. అన్ని జిల్లాల్ోల దుకాణాలు, మార్కెట్లు మ, రవాణా సేవలు నిలిచిపోయాయి. ముజఫరాబాద్‌లో ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఈ నిరసనలకు జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామి యాక్షన్ కమిటీ (జెకెజెఎసి) నాయకత్వం వహిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం ముందు 38 పాయింట్ల డిమాండ్లు ఉంచింది. వీటిలో రాజకీయ సంస్కరణలు, సబ్సిడీ గోధుమ పిండి, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, ఉచిత విద్య , ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ అధికారులకు ప్రోత్సాహకాల తొలగింపు వంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని JKJAAC నాయకులు ప్రతిజ్ఞ చేశారు. తిరుగుబాటును తగ్గించడానికి పాకిస్తాన్ అధికారులు ఫెడరల్ మంత్రులు సహా ఎనిమిది మంది సభ్యుల ఉన్నత స్థాయి ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని పంపారు. కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి PoK ప్రధాన మంత్రి చౌదరి అన్వరుల్ హక్‌తో కలిసి ఉన్న కమిటీ JKJAAC ప్రతినిధులతో చర్చలు ప్రారంభించింది. లాక్‌డౌన్ , ఇంటర్నెట్ బ్లాక్‌అవుట్ ఉన్నప్పటికీ నిరసలు జరుగుతున్నాయి. ముజఫరాబాద్, ధిర్‌కోట్ ఇతర ప్రాంతాలలో నిరాయుధ నిరసనకారుల మరణాలకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేసి, శిక్షించాలని JKJAAC నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
భారతదేశం హిందూ వ్యతిరేక హింసలో పాల్గొంటుందనే బంగ్లాదేశ్ ఇటీవల చేసిన ఆరోపణలపై విదేశాగ మంత్రిత్వ శాఖ స్పందించంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడలేక, నిందను మారుస్తోంది. వారు మైనారిటీలపై హింసకు కారణమైన స్థానిక తీవ్రవాద గ్రూపులను ఆత్మపరిశీలన చేసుకోవాలని భారత్ సూచించింది.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత ద్వైపాక్షిక భద్రతా సహకారంపై, జైస్వాల్ ఇటీవల కెనడాతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
సెప్టెంబర్ ప్రారంభంలో, భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ న్యూయార్క్‌లో జరిగిన UN జనరల్ అసెంబ్లీ సందర్భంగా జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌ను కలిశారు. G4 విదేశాంగ మంత్రులతో కలిసి ఈ సమావేశం UN భద్రతా మండలి సంస్కరణపై దృష్టి సారించిం. వాడేఫుల్ భారతదేశ పర్యటన సందర్భంగా, రెండు దేశాలు విద్యా సంబంధాలను పెంచేందుకు చొరవ తీసుకోవాలని నిర్ణయించాయి.