Tirupati Bomb Squad: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట 4 RDX IEDలు  పెట్టామని  మెయిల్స్ వచ్చాయి.  4 RDX-ఆధారిత IEDలు అంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్ పేలుతాయని  ఈ ఈమెయిల్స్‌లో ఉంది.  శ్రీలంక లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) , పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ (ISI)   కలిసి ఈ ఆపరేషన్‌ను ప్లాన్ చేసినట్టు చెప్పుకున్నారు.  ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇళ్లను టార్గెట్ చేసి 2 RDX బాంబులు దాచినట్టు మెయిల్‌లో హెచ్చరిక ఇచ్చారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా నుంచి ఈ కుట్ర రూపొందుతోందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు సూచించాయి.                బుధవారం రాత్రి తిరుపతి జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్, స్థానిక అధికారులు, ముఖ్యంగా తిరుపతి టెంపుల్ ట్రస్ట్‌కు ఒకే సమయంలో 5 బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్‌లో “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” అనే కోడ్‌నేమ్‌తో 4 RDX IEDలు శుక్రవారం  12 గంటలకు పేల్చే ప్లాన్ ఉందని, ఇందులో తిరుపతి టెంపుల్, స్థానిక మార్కెట్లు, రాజకీయ నాయకుల ఇళ్లు టార్గెట్‌లు అని పేర్కొన్నాయి. సీఎం చంద్రబాబు ఇల్లు  ,  తాడేపల్లిలోని జగన్ ఇల్లు  లో 2 RDX బాంబులు ఇప్పటికే  పెట్టామని వీటిని యాక్టివేట్ చేస్తామని బెదిరించారు.

Continues below advertisement

అయితే ఇలాంటి మెయిల్స్.. ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు. కానీ సీరియస్ గాతీసుకుని సోదాలు నిర్వహిస్తారు.  బాంబ్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు  సీఎం చంద్రబాబు, జగన్ ఇళ్ల వద్ద  సెక్యూరిటీ పెంచారు.  తిరుపతి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు,   తిరుపతి టెంపుల్, మార్కెట్లు, రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద  సోదాలు చేస్తున్నారు.  

 తిరుపతితో పాటు తమిళనాడులోని వ్యక్తులకు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చినట్లుగా గుర్తించారు. త్రిషతో పాటు శనివారం ఉదయం తమిళనాడులోని పలువురు రాజకీయ ప్రముఖుల ఇళ్లకు సైతం బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి నివాసంతో పాటు రాజ్ భవన్, తమిళనాడు భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్ట్రర్స్ సహా కొందరు ప్రముఖులకు బెదిరింపు ఫోన్స్ వచ్చాయి. చివరకు అవి ఫేక్ కాల్స్ అని తేలాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెర్చ్ ఆపరేషన్స్ వల్ల ప్రజలు భయాందోళనలకు గురి అయ్యారు. తిరుపతిలోనూ బాంబు పేలుళ్ల పేరుతో వచ్చినవి ఫేక్ మెయిల్స్ గానే అనుమానిస్తున్నారు.