New Parliament Opening:



సాధికారతకు చిహ్నం..


కొత్త పార్లమెంట్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్‌ని ప్రారంభించిన వెంటనే ఆయన సెంగోల్‌ని లోక్‌సభలో ఏర్పాటు చేశారు. మత గురువులు, సాధువుల పూజల మధ్య ఈ తంతు శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్‌ని ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. భారత దేశ సాధికారతకు ఇది చిహ్నంగా మారుతుందని ఆకాంక్షించారు. కలలన్నింటినీ నిజం చేసేందుకు ఇది వేదిక అవుతుందని వెల్లడించారు. 


"భారత దేశ కొత్త పార్లమెంట్‌ ప్రారంభించుకున్నాం. మనందరి గుండెలు గర్వంతో ఉప్పొంగుతున్నాయి. నమ్మకంతో నిండిపోయాయి. మన దేశ సాధికారతకు ఈ భవనం నిలువెత్తు నిదర్శనంగా ఉంటుందని ఆకాంక్షిస్తున్నాం. కొత్త కలలను కనడంతో పాటు వాటిని నిజం చేసుకునేందుకు ఇది వేదికగా మారుతుందని ఆశిస్తున్నాను. మన దేశ స్థాయిని పెంచడమే కాకుండా..కొత్త శిఖరాలు చేరుకోడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నాను. మన దేశం మరింత శక్తిమంతంగా మారుతుందని నమ్ముతున్నాను"


- ప్రధాని నరేంద్ర మోదీ