Masks  Gloves  CCTV and More Uttar Pradesh Eateries : ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన అంశాల్లో ప్రతీ సారి వివాదాలు తలెత్తుతూనే ఉంటాయి. నిజమో.. ఫేకో తెలియదు కానీ.. కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ప్రభుత్వం కూడా వాటిని  కట్టడి చేయడానికి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అసలేం జరిగిందంటే ...


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉమ్మి కలిపే వీడియోలు


యూపీలో ప్రతి ఏడాది సంప్రదాయంగా కన్వర్ యాత్ర జరుగుతుంది. దీన్ని కావడి యాత్రగా చెప్పుకోవచ్చు. యూపీలోని హిందువులు కాలినడకన గంగాజలాన్ని  కావడి ద్వారా తీసుకుని  వచ్చి తమ గ్రామాల్లో శివాలయాల్లో అభిషేకం  చేస్తారు. ఈ కావడి యాత్ర కాలినడకన జరుగుతుంది. ఈ దారిలో పెద్ద ఎత్తున హోటల్స్ ఉంటాయి. వీటిలో ముస్లింలు కూడా యజమానులు ఉంటారు. వారు ఆహారాన్ని తయారు చేసిన తర్వాత మలినం చేస్తారని..హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీస్తారన్న ప్రచారం జరిగింది. పైగా వారి హోటళ్లకు హిందువుల పేర్లు ఉంటాయి. 


తిరుమల లడ్డు కల్తీ ఉద్దేశ్యపూర్వక నేరమే! సంచలన వ్యాఖ్యలు చేసిన అవిముక్తేశ్వరానంద్ సరస్వతి


ఆహారాన్ని అపవిత్రం చేయకుండా చర్యలు తీసుకున్న యూపీ ప్రభుత్వం


సోషల్ మీడియాలో వడ్డించడానికి సిద్ధమయ్యే ఆహారంలో ఉమ్మి వేయడం.. ఇతర పదార్ధాలను మలినం చేస్తున్న వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్ అయ్యాయి. ఇలా వడ్డించే ముందు ఉమ్మి వేయడం అనేది వాళ్ల సంప్రదాయమని ప్రచారం కూడా చేశారు. అయితే అదంతా తప్పుడు ప్రచారమని చాలా సార్లు ప్రకటించారు. అయనా హిందువుల్లో అనుమానాలు తొలగలేదు. అందుకే యూపీ ప్రభుత్వం హోటల్స్‌కు కొన్ని నిబంధనలు ప్రకటించింది.  అ ప్రకారం.. హోటల్స్‌లో అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలు పెట్టాలి. అలాగే ఆహారాన్ని తయారు చేసేవారు, వడ్డించేవారు తప్పనిసరిగా మాస్కులు పెట్టు్కోవాలి. అలా గ్లవ్స్ కూడా తప్పనిసరిగా ఉపయోగించాలి.  


హాల్‌లో రక్తపు మరకలు, ప్రిడ్జ్‌లో బాడీ పార్ట్స్‌- సంచలనం సృష్టించిన బెంగళూరు కేసులో పురోగతి


గతంలో హోటళ్ల బోర్జులపై యజమానుల పేర్లు రాయాలని ఆదేశింంచి యోగి సర్కార్              


ఈ రూల్స్ ను హోటల్స్ అసోసియేషన్లు కూడా సమర్థించాయి. వినియోగదారులకు నమ్మకం కలిగించేలా తాము వ్యవహరిస్తామని ప్రకటించాయి. గతంలో యూపీ ప్రభుత్వం హోటల్ బోర్జులపై యజమానుల పేర్లు రాయాలని ఆదేశించింది. హోటల్ పేరు హిందువు పేరుతో ఉండి.. యజమాని మాత్రం ముస్లిం అయితే తెలిసిపోతుందని ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ అంశం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది.