Maruti Brezza Facelift Spotted Testing with Emission Equipment: ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటిగా నిలిచిన మారుతి బ్రెజ్జా సరికొత్త అవతారంలో లాంచ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. అప్‌కమింగ్ 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ (Maruti Brezza Facelift) మోడల్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ మరోసారి కెమెరా కంటికి చిక్కింది. ఈసారి ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెనుక భాగంలో ఎమిషన్ టెస్టింగ్ పరికరాలు అమర్చి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీ సమీపంలోని వెస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ టెస్ట్ మ్యూల్ కనిపించింది. ఈ తాజా స్పై షాట్స్ ప్రకారం మారుతి సుజుకి ఈ కార్ లో కేవలం డిజైన్ మార్పులు మాత్రమే కాకుండా ఇంజిన్ పరంగా కూడా ఒక మేజర్ అప్‌డేట్ తీసుకురాబోతున్నట్లు హింట్ లభిస్తోంది. సాధారణంగా ఎమిషన్ టెస్టింగ్ కిట్లు వాడారంటే ఇంజిన్ లో మార్పులు జరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చు, దీనివల్ల ఇందులో కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ రాబోతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Continues below advertisement

Read Also: సరికొత్త లుక్‌లో రానున్న New Kia Sonet .. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో వచ్చే మార్పులివే

కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్..

Continues below advertisement

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మారుతి బ్రెజ్జా కారులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను ఉపయోగిస్తున్నారు. అయితే రాబోయే ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో దీనికి బదులుగా చిన్నదైన 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లేదా ఇంటర్నేషనల్ మార్కెట్లలో మారుతి ఫ్రాంక్స్ కార్ లో ఇస్తున్న 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. ఈ టర్బో పెట్రోల్ ఆప్షన్ గనుక వస్తే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్ లాంటి పవర్‌ఫుల్ టర్బో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు బ్రెజ్జా గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. దీనితో పాటు చిన్న ఇంజిన్ ను ఉపయోగించడం వల్ల మారుతి కంపెనీ కొన్ని సెలెక్టెడ్ వేరియంట్లపై పన్నులను తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. భారతీయ టాక్స్ రూల్స్ ప్రకారం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, 1.2 లీటర్ల కంటే తక్కువ కెపాసిటీ ఉన్న పెట్రోల్ కార్లపై జీఎస్‌టీ రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ ఇంజిన్ వల్ల బ్రెజ్జా ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తోంది.

Read Also: 30 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్, 11 లక్షల కన్నా తక్కువ ధరలో Hyundai Venue Hybrid

ఇంటీరియర్ మార్పులు..

ఇంజిన్ మార్పులతో పాటు 2026 మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కారులో సరికొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ను కూడా పరిచయం చేయబోతున్నారు. గతంలో వచ్చిన స్పై షాట్స్‌లోనే కారు లోపల అప్‌డేట్ చేసిన గేర్ లివర్ స్పష్టంగా కనిపించింది. కారు క్యాబిన్ లోపల కస్టమర్ల కోసం ప్రస్తుతమున్న 9-ఇంచ్ టచ్‌స్క్రీన్‌కు బదులుగా పెద్దదైన 10.1-ఇంచ్ ఇన్‌ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేను అమర్చనున్నారు. ఇటీవల షోకేస్ చేసిన సరికొత్త మారుతి విక్టోరిస్ ఎస్‌యూవీలో కనిపించిన సిస్టమ్ లాగే ఇది కూడా ఉండే అవకాశం ఉంది. కారు ఇంటీరియర్ ను మరింత ప్రీమియంగా మార్చడానికి కొత్త క్యాబిన్ ట్రిమ్స్, ఫ్రెష్ కలర్ ఆప్షన్లను కూడా మారుతి సుజుకి ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త ఫీచర్లు కారు లోపల కూర్చునే ప్రయాణికులకు ఒక లగ్జరీ ఫీలింగ్ ఇస్తాయి.

ఎక్స్‌టీరియర్ డిజైన్ చేంజెస్, సేఫ్టీ అప్‌డేట్స్..

కారు బయటి డిజైన్ విషయానికి వస్తే మారుతి సుజుకి ఇందులో కంప్లీట్ రీడిజైన్ కాకుండా కొన్ని స్టైలింగ్ మార్పులు మాత్రమే చేస్తోంది. ఫ్రంట్ గ్రిల్ ఇప్పుడు చాలా క్లీన్‌గా, మరింత ప్రీమియం లుక్‌తో కనిపిస్తోంది. బంపర్ లో ఫాగ్ ల్యాంప్ హౌసింగ్స్ మార్చారు, అలాగే కింద థిక్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ ఎలిమెంట్‌ను జోడించారు. గ్రిల్ మధ్యలో ఒక రాడార్ హౌసింగ్ కనిపించడం బ్రెజ్జా హిస్టరీలోనే మొదటిసారిగా అడాస్ (ADAS) సేఫ్టీ ఫీచర్లు రాబోతున్నాయనే విషయానికి హింట్ ఇస్తోంది. కారు వెనుక వైపు డిజైన్ లో పెద్దగా మార్పులు లేవు, బంపర్ డిటైలింగ్ లో కొద్దిగా మార్పులు చేశారు. కొత్తగా డిజైన్ చేసిన 16-ఇంచ్ అలాయ్ వీల్స్ కారుకు మంచి లుక్ ఇస్తున్నాయి, అయితే వెనుక చక్రాలకు ఇప్పటికీ డ్రమ్ బ్రేక్స్ నే కొనసాగించారు. ఈ సరికొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఈ సంవత్సరం పండుగల సీజన్ లో లేదా 2027 ప్రారంభంలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చాక టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, స్కోడా కైలాక్, కియా సైరోస్ మోడళ్లతో పోటీ పడుతుంది.