Kia Sonet New Design and Features | భారత ఆటో మార్కెట్లో కాంపాక్ట్ SUVలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఇదే సెగ్మెంట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును Kia Sonet తెచ్చుకుంది. ఇప్పుడు కియా కంపెనీ ఈ పాపులర్ SUVని కొత్త లుక్‌లో రీడిజైన్ చేసి లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల న్యూ జనరేషన్ కియా సోనెట్‌ను టెస్టింగ్ చేస్తున్న సమయంలో కొందరు దీన్ని గుర్తించారు. దాంతో దీని డిజైన్, ఫీచర్లకు సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. కియా కొత్త సోనెట్ గతంలో కంటే చాలా స్టైలిష్‌గా, ఫీచర్-లోడెడ్‌గా ఉంటుందని భావిస్తున్నారు.
టెస్టింగ్ సమయంలో కనిపించిన కొత్త Kia Sonet పూర్తిగా క్యామఫ్లేజ్ తో కప్పి ఉంది. అయినప్పటికీ కొత్త మోడల్‌కు సంబంధించిన పలు డిజైన్ ఎలిమెంట్స్ కనిపించాయి. కొత్త కియా సోనెట్ SUV ఫ్రంట్ లుక్ ఇప్పుడు గతంలో కంటే మరింత వెడల్పుగా, బోల్డ్‌గా కనిపించనుంది. ఇందులో పెద్ద గ్రిల్, కొత్త LED DRL, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్ వచ్చే అవకాశం ఉంది. కియా కంపెనీ దీని డిజైన్‌ను తన పెద్ద SUV అయిన Kia Seltos ఆధారంగా డిజైన్ చేయవచ్చు. దీనివల్ల ఇది పాత డిజైన్ కంటే మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
ఇంటీరియర్ ఎలా ఉంటుంది?కొత్త Kia Sonet లో కేవలం బయటి భాగంగలో మార్పులు మాత్రమే ఉండవు. దీని ఇంటీరియర్‌లో కూడా మార్పులు చూడవచ్చు. నివేదికల ప్రకారం, ఇందులో పెద్ద 12.3 అంగుళాల స్క్రీన్, కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన సీట్లు, మరింత ప్రీమియం క్యాబిన్ ఇవ్వనున్నారు. ఇది కాకుండా పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్ కనెక్టెడ్ ఫీచర్లు, కొత్త టెక్నాలజీ కూడా చేరుతుంది. దాంతో కియా సోనెట్ ఈ విభాగంలో తన ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వగలదు.
Read Also: Top 5 Hybrid Cars Mileage: ఆఫీసుకు వెళ్లేవారికి అద్భుతమైన మైలేజ్ ఇచ్చే టాప్ 5 హైబ్రిడ్ కార్లు ఇవే
సేఫ్టీ విషయంలో కూడా కొత్త సోనెట్ చాలా స్ట్రాంగ్‌గా మారనుంది. దీనిని కొత్త K1 ప్లాట్‌ఫారమ్‌పై తయారు చేయనున్నారు. దీనివల్ల దీని కియా సోెనెట్ బాడీ స్ట్రక్చర్, బలం మరింత మెరుగవుతాయి. దీనితో పాటు ADAS వంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల వాహనదారులకు డ్రైవింగ్ గతంలో కంటే మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారవచ్చు.
ఇంజిన్ వివరాలు, మార్కెట్లో పోటీదారులుకియా సోనెట్ న్యూ జనరేషన్ ఇంజిన్ విషయానికి వస్తే, కంపెనీ ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్లనే కంటిన్యూ చేయవచ్చు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్లు మ్యాన్యువల్, iMT, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో రావచ్చు. సమాచారం ప్రకారం, కంపెనీ భవిష్యత్తులో హైబ్రిడ్ టెక్నాలజీపై కూడా వర్క్ చేస్తోంది.
భారత మార్కెట్లో కొత్త Kia Sonet పోటీ మారుతి సుజుకీ బ్రెజ్జా ( Maruti Suzuki Brezza), Tata Nexon, మహీంద్రా ఎక్స్‌యూవీ (Mahindra XUV 3XO), హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) వంటి వాహనాలతో ఉంటుంది. కియా కంపెనీ దీని కొన్ని మోడల్స్ ఈ ఏడాది రిలీజ్ చేస్తే.. వచ్చే ఏడాదికి మరికొన్ని లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, అడ్వాన్స్డ్ సేఫ్టీతో ఈ SUV కస్టమర్లకు ఒక బలమైన ఆప్షన్‌గా మారవచ్చు.
