Honda NX500 E Clutch Launched in India Price Features , EMI Calculation: ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా సరికొత్త ఎన్‌ఎక్స్500 ఈ-క్లచ్ (Honda NX500 E-Clutch) మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. దేశీయంగా దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 7,43,900 గా నిర్ణయించారు. సాధారణ క్లచ్ ఉన్న పాత ఎన్‌ఎక్స్500 మోడల్‌తో పోలిస్తే ఈ సరికొత్త ఈ-క్లచ్ వెర్షన్ ధర రూ. 1.11 లక్షలు ఎక్కువగా ఉంది.

Continues below advertisement

ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో రైడర్ చేతితో నొక్కాల్సిన పాత కాలపు క్లచ్ లివర్‌ను పూర్తిగా తొలగించారు. దానికి బదులుగా ఇందులో వాడిన సరికొత్త ఈ-క్లచ్ టెక్నాలజీ సహాయంతో రైడర్ ప్రమేయం లేకుండానే బైక్ ఆటోమేటిక్‌గా గేర్లను మార్చుకుంటుంది. లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి, ట్రాఫిక్‌లో ఇబ్బంది పడే వారికి ఈ సరికొత్త ఫీచర్ ఎంతో లగ్జరీ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Read Also: Five Best Electric SUVs: పెట్రోల్ డీజిల్ ధరల సెగ-  మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే

Continues below advertisement

యువ రైడర్లను ఆకట్టుకునేలా ఈ-క్లచ్ ఫీచర్లు

హోండా ఎన్‌ఎక్స్500 మోటార్‌సైకిల్‌లో ప్రవేశపెట్టిన ఈ-క్లచ్ టెక్నాలజీ ముఖ్యంగా కొత్త రైడర్లకు డ్రైవింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. అడ్వెంచర్ బైకులను ఇష్టపడే యువతతో పాటు మొదటిసారి పెద్ద ప్రీమియం బైకుకు అప్‌గ్రేడ్ అవ్వాలని ప్లాన్ చేసే కస్టమర్లను ఈ మోడల్ ఎక్కువగా ఆకర్షించే అవకాశం కనిపిస్తోంది. ఎంతో కాంపాక్ట్ సిస్టమ్‌తో డిజైన్ చేసిన ఈ టెక్నాలజీ, అవసరాన్ని బట్టి క్లచ్‌ను ఆటోమేటిక్‌గా ఎంగేజ్ అలాగే డిస్‌ఎంగేజ్ చేస్తుంది. ఇందులో కస్టమర్ల కోసం మాన్యువల్ ఓవర్‌రైడ్ ఫీచర్‌ను కూడా అందించారు. అంటే రైడర్ కోరుకున్నప్పుడు సాధారణ బైక్‌లాగే క్లచ్ లివర్‌ను ఉపయోగించి మాన్యువల్‌గా కూడా గేర్లు మార్చుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం కార్లలో అందుబాటులో ఉన్న ఏఎంటీ (AMT) ఆటోమేటిక్ టెక్నాలజీ లాగే ఈ బైక్ సిస్టమ్ పనిచేస్తుంది.

లోన్ అమౌంట్ ,నెలవారీ ఈఎమ్ఐ లెక్కలు

సరికొత్త హోండా ఎన్‌ఎక్స్500 ఈ-క్లచ్ బైక్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్న వారి కోసం  క్విక్ ఈఎమ్ఐ (EMI) క్యాలిక్యులేషన్ చూద్దాం. ఈ నెలవారీ ఈఎమ్ఐ అంచనా కోసం బైక్ పూర్తి ఎక్స్-షోరూమ్ ధర అయిన రూ. 7,43,900 మొత్తాన్ని లోన్ అమౌంట్ లాగా (100 శాతం లోన్) పరిగణనలోకి తీసుకున్నాము. బ్యాంక్ వడ్డీ రేటును 9.5 శాతంగా ప్రామాణికంగా తీసుకుని, వాహనదారులు సాధారణంగా ఎంచుకునే 24 నెలలు అలాగే 36 నెలల రీపేమెంట్ కాలవ్యవధులను బట్టి ఈఎమ్ఐ లెక్కలు ఎలా ఉంటాయో ఇక్కడ స్పష్టంగా చూద్దాం. దీని ద్వారా బైక్ కొనేందుకు బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుంది.

Read Also: Tata Altroz CNG AMT EMI Details: టాటా ఆల్ట్రోజ్ సీఎన్‌జీ ఏఎంటీ  కారు కొనాల‌నుకుంటున్నారా..? ఈఎమ్ఐ వివరాలు ఇవే.! 

రీపేమెంట్ కాలవ్యవధులు ,వడ్డీ వివరాలు

ఈ బ్యాంక్ లోన్ లెక్కల ప్రకారం, ఒకవేళ మీరు 24 నెలల (రెండు సంవత్సరాలు) రీపేమెంట్ కాలపరిమితిని ఎంచుకుంటే ప్రతి నెల ఈఎమ్ఐ రూపంలో రూ. 34,156 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రెండు సంవత్సరాల కాలంలో లోన్ పై పడే మొత్తం వడ్డీ భారం రూ. 75,839 అవుతుంది. అలా కాకుండా నెలవారీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మీరు 36 నెలల (మూడు సంవత్సరాలు) రీపేమెంట్ కాలవ్యవధిని సెలెక్ట్ చేసుకుంటే ప్రతి నెల కట్టాల్సిన ఈఎమ్ఐ అమౌంట్ రూ. 23,829 కి తగ్గుతుంది. అయితే ఈ మూడు సంవత్సరాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూ. 1,13,955 కి పెరుగుతుంది. కస్టమర్లు తీసుకునే లోన్ మొత్తం, బ్యాంక్ ఫైనల్ వడ్డీ రేటు, రీపేమెంట్ టెన్యూర్ వంటి రకరకాల అంశాలపై ఆధారపడి ఈ నెలవారీ ఈఎమ్ఐ మారుతుందని గమనించాలి.