Maoist Party Central Committee member Asanna :   మావోయిస్టు పార్టీ  కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న అలియాస్  తక్కళ్లపల్లి వాసుదేవరావు గురువారం చత్తస్ ఘడ్ సీఎం ఎదుట లొంగిపోనున్నారు.   ఖమ్మం జిల్లా తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఈ  మావోయిస్టు నాయకుడు రాజకీయ,  సైనిక విషయాల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు.  ఆయన నేతృత్వంలో వివిధ స్థాయిల కేడర్లతో కలిపి సుమారు 70 మంది మావోయిస్టులు అక్టోబర్ 16 గురువారం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ లేదా డిప్యూటీ సీఎం విజయ్ శర్మ సమక్షంలో సరెండర్ అవుతారు.   ఈ సరెండర్ మావోయిస్టు ఉద్యమానికి మరో తీవ్ర దెబ్బగా మారనుంది, ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.                           

Continues below advertisement


'ఆశన్న' ఎవరు? 


తక్కళ్లపల్లి వాసుదేవరావు, 1970ల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాలో జన్మించాడు. ఆయన మావోయిస్టు ఉద్యమంలో 1990ల చివరలో చేరాడు .పార్టీలో నేగంగా ఎదిగాడు.  కేంద్ర కమిటీ సభ్యుడిగా పదొన్నతి పొందారు.  మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాలు, ప్రచార విషయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గడ్ రెడ్ కారిడార్ ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నారు.                   
 
CPI-మావోయిస్టు పార్టీలో ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, దక్షిణ భారత జోనల్ కమిటీలో కూడా కీలకంగా ఉన్నారు.  మావోయిస్టు ప్రచారాలు, రిక్రూట్‌మెంట్, ఫండ్ కలెక్షన్ విషయాల్లో నిపుణుడు. ఆయనపై కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల బహుమతి ప్రకటించింది.
 2025 మేలో జనరల్ సెక్రటరీ బసవరాజు మరణం తర్వాత, కేంద్ర కమిటీలో కొత్త నియామకాలు జరిగినప్పుడు, 'ఆశన్న'పై ఆసక్తి పెరిగింది. అయితే, పార్టీ ఆయనకు జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వకపోవడంతో, ఆయనలో అసంతృప్తి పెరిగిందని ఇంటెలిజెన్స్ రిపోర్టులు తెలిపాయి. బదులుగా, మండవి హిద్మా  మావోయిస్టు మిలిటరీ కమాండర్ ను దక్షిణ బస్తార్ జోనల్ కమిటీ సెక్రటరీగా నియమించారు. ఈ నిర్ణయం తెలుగు కేడర్లలో ఆంధ్ర-తెలంగాణ నుంచి వచ్చినవారు  అసంతృప్తిని రేకెత్తించింది, ఎందుకంటే 'ఆశన్న' రాజకీయ, సైనిక రెండు విషయాల్లోనూ సామర్థ్యవంతుడని  ప్రచారం ఉంది.  ఈ అసంతృప్తి  ఇటీవలి ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మాడ్ ప్రాంతంలో జరిగిన కౌంటర్-నక్సల్ ఆపరేషన్లు వల్ల 'ఆశన్న' సరెండర్ నిర్ణయానికి దారితీసిందని పోలీస్ అధికారులు అంచనా వేస్తున్నారు.  బుధవారం మహారాష్ట్రలో భూపతి @ మల్లోజుల వేణుగోపాల్ రావు సరెండర్ అయ్యారు.                     
 
గతంలో  ఛత్తీస్‌గఢ్‌లో 600 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు.  వరుస లొంగుబాట్లు  మావోయిస్టు ఉద్యమానికి ఎదురుదెబ్బలుగా భావిస్తున్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల సంఖ్య 600కి తగ్గడంతో, రాష్ట్ర ప్రభుత్వం 'నక్సలిజం  నిర్మూలన పాలసీ'లో రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు రివార్డులు ప్రకటించింది. లొంగిపోయే వారందరికీ రివార్డులు అందించనున్నారు.