World Bycycle Day : శుక్రవారం వరల్డ్ సైక్లింగ్ డే. ఒకప్పుడు సైకిల్ ఉండటం అనేది ప్రివిలేజ్. ప్రతి ఒక్కరి వాహనం సైకిలే. స్కూటర్ ఉంటే ధనవంతుడని అర్థం. ఆ స్థాయికి వెళ్లని వాళ్లు అందరి వాహనం సైకిలే. ఆరోగ్యానికి ఆరోగ్యం.. అంతకు మించిన సరసైన వాహనం. ముఫ్పైలు.. నలభైల్లో ఉన్న వారికి ఈ సైకిల్ తో ఎంతో గొప్ప అనుభవం ఉంటుంది. వాటిని ఇప్పుడు కొంత మంతి సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు. మనం సైకిల్ తొక్కేటప్పుడు చిన్న సైకిళ్లు లేవు.,పెద్ద సైకిళ్లనే అడ్డతొక్కుడుగా నేర్చుకోవాలి. అడ్డతొక్కుడుతో సైకిల్ నేర్చుకోవడం ప్రారంభించేవారినికి కూడా ట్విట్టర్ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తోంది.
అప్పట్లో సైకిల్ రేసులు అంటే.. ఇప్పటి ఎఫ్ వన్ రేసులు కూడా దిగదుడుపే .
ఇప్పుడు పార్లమెంట్ దగ్గరకు వెళ్తే ఉద్యోగులు కూడా ఖరీదైన కార్లలో వస్తూంటారు. కానీ అప్పట్లో సైకిల్ మీద వచ్చే వారే ఎక్కువ. అంతకు మించిన లగ్జరీ మరొకటి ఉండదు.
పాత కాలంలోనే కాదు.. ఓ ఇరవైఏళ్ల కిందటి వరకూ సైకిల్ స్టాండ్ అనేది పెద్ద బిజినెస్. జనం గుమికూడే ప్రాంతాలు.. సినిమా హాళ్లలో సైకిల్ పార్కింగ్‌కుపెద్ద డి్మాండ్ ఉంటుంది. ఎక్కడ చూసినా వరుసగా సైకిళ్లు సహజంగానే ఉంటాయి.
సైకిల్‌గా పడే పంచర్ కష్టాలు అనుభవించని వాళ్లు ఉండరేమో
సైకిళ్లకు ఉండే డిమాండ్ చాలా ఎక్కువ కాబట్టి.. అప్పట్లో కూడా కంపెనీలు క్రికెటర్లతో ప్రకటనలు ఇప్పించేవి.
మధ్యలో కొంత కాలం సైకిల్‌కు గడ్డు పరిస్థితులు వచ్చి ఉంటాయి కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. మళ్లీ సైక్లింగ్‌కు గొప్ప రోజులు వచ్చాయి. ఎక్కడ చూసినా సైకిళ్లు కనిపిస్తున్నాయి. కాకపోతే అవి గతంలోలా ప్రజా రవాణా సాధనంలా కాకుండా... ఫిట్ నెస్ కోసం అన్నట్లుగా ఉపయోగపడుతున్నాయి.