Cricketer Mohammed Shami: చాంపియన్స్ ట్రోఫిలో ఆడుతున్న భారత ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేలా మహమ్మద్ షమీపై కొంత మంది చేస్తునన విమర్శలు మంచిదని కాదన్న ముస్లిం మత పెద్దలు అంటున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మహమ్మద్ షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తోందని ముస్లింలు అందరూ రోజా ఉపవాసాలు పాటించాలని భావిస్తున్నారు. కనీసం మంచి నీళ్లు కూడా తాగరని అంటున్నారు. ఈ నిబంధనను షమీ ఉల్లంఘించాడని కొంత మంది మత పెద్దలు ఆరోపణలుచేస్తున్నారు.
క్రీడాకారులు మైదానంలో ఆడుతున్నపుడు గ్లూకోజ్ వాటర్ లేదా మరేదైనా డ్రింక్స్ తాగుతారు. బాడీ అలసిపోకుండా ఉండేందుకు ఎనర్జీ కోసం ఇలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ఆట ఆడుతున్నపుడు దాహం వేసినా ఎనర్జీ డ్రింక్ తాగకపోతే అది డీహైడ్రేషన్‌కు గురై కళ్లు తిరిగే అవకాశం ఉంటుంది. అందువల్లనే క్రీడాకారులు మైదానంలో కాస్త బ్రేక్ తీసుకుని మరీ డ్రింక్స్ తాగుతారు. అందుకే షమీ తప్పేమీ చేయలేదని.. చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు ఉండాలి కానీ.. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి.. మినహాయింపును ఇస్లాం ఇచ్చిందని ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి తెలిపారు.
షమీని నిందించడం కరెక్ట్ కాదని అత్యధిక మంది ముస్లిం మత పెద్దలు స్పష్టం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లు అందరూ అదే పని చేస్తున్నారన్న సంగతిని గుర్తించాలని అంటున్నారు.
షమీపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్న వారెవరికీ ఇస్లాంపై సరిగ్గా అవగాహన లేదని ఎక్కువ మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగాషమపై కొందరు చేసిన విమర్శలు అసూయతోనే చేశారని అంటున్నారు.