'మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదు... జీవితాన్ని చివరి వరకు పంచుకోవడం' - ఇదీ 'మిస్టర్ రెడ్డి' టీజర్‌ ఎండింగ్‌లో హీరో రాజా చెప్పే డైలాగ్. మాటల్లో మాత్రమే కాదు, సినిమాలోనూ పెళ్లి, ప్రేమ గొప్పదనం చెప్పామని చిత్ర బృందం అంటోంది. ఇటీవల తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ సినిమా టీజర్ విడుదల చేశారు. పట్నం సునీతారెడ్డి, నల్గొండ గద్దర్ ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. 

మనసే లేని డాక్టర్...రౌడీతో ప్రేమలో పడితే?గోల్డ్ మ్యాన్ రాజా (టి. నరసింహా రావు - టీఎన్ఆర్) హీరోగా నటించడంతో పాటు  స్వయంగా ప్రొడ్యూస్ చేసిన సినిమా 'మిస్టర్ రెడ్డి'. వెంకట్ వోలాద్రి దర్శకుడు. టీఎన్ఆర్ ప్రొడక్షన్స్ పతాకం మీద రూపొందిన ఈ సినిమాలో మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి ఇతర ప్రధాన తారాగణం.

'మిస్టర్ రెడ్డి' టీజర్ చేస్తే... హీరోయిన్ డాక్టర్ రోల్ చేశారు. హీరో ఏమో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్, దండాలు చేసే వ్యక్తి అని అర్థం అవుతోంది. కథానాయికతో 'నువ్వు మనసే లేని డాక్టర్' అని బామ్మ ఎందుకు చెప్పింది? రౌడీ లాంటి వ్యక్తితో ఆమె ఎందుకు స్నేహం చేసింది? అతను ప్రపోజ్ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసింది? హీరో బాల్యంలో అతను ప్రేమించిన అమ్మాయి, ఇప్పుడీ డాక్టర్ ఒక్కరేనా? హీరో గతం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read: 'జీ తెలుగు'ను డామినేట్ చేసిన 'స్టార్ మా'... మళ్లీ కార్తీక దీపమే టాప్.. టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయ్... ఈ వారం లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో చూడండి

హీరో గోల్డ్ మ్యాన్ రాజా మాట్లాడుతూ... ''మా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్, సునీత, నల్లగొండ గద్దర్ గార్లకు థాంక్స్. అందరికీ టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను. కొత్త వాళ్లమంతా కలిసి చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని అన్నారు. దర్శకుడు వెంకట్ వోలాద్రి ''మా సినిమాకు పని చేసిన వాళ్లంతా సినిమా ఇండస్ట్రీకి కొత్త. కష్టపడి చేసిన మా ప్రయత్నాన్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను'' అన్నారు. ఈ కార్యక్రమంలో మహాదేవ్, అనుపమ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

Also Read: ఒరిస్సాలో అడుగు పెట్టిన మహేష్... రాజమౌళి సినిమా కోసం, ఆయనతో వెళ్లిందెవరో గుర్తు పట్టారా?

Mr Reddy Movie Cast And Crew: టీఎన్ఆర్, మహాదేవ్, అనుపమ ప్రకాష్, దీప్తి, భాస్కర్, మల్లికార్జున్, శంకర్ మహతి, రాధిక, ఏకే మణి, ఫణి తదితరులు నటించిన ఈ సినిమాకు కొరియోగ్రాఫర్: గోవింద్, ఫైట్స్:యాక్షన్ గౌరీ, ఛాయాగ్రహణం: కెఎన్ భూషణ్, సంగీతం: కేఎస్ఆర్ మ్యూజికల్, నిర్మాత : టీఎన్ఆర్, రచన - దర్శకత్వం : వెంకట్ రెడ్డి వోలాద్రి.

Also Readమా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె