'పౌరుషం - ది మ్యాన్ హుడ్' సినిమాను ప్రతి మహిళకు అంకితం ఇస్తున్నట్లు దర్శకుడు, హీరో షెరాజ్ మెహ్ది (Sheraz Mehdi) తెలిపారు. ఆయన దర్శకత్వంలో యువిటి హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయా ప్రొడక్షన్స్ సంస్థల మీద అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మించిన చిత్రమిది. మహిళల దినోత్సవం మార్చి 8 అయితే... దానికి ఒక్క రోజు ముందు మార్చి 7 (శుక్రవారం) ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
నిద్రలో అడిగినా కథతో సహా సీన్లు అన్నీ చెబుతా!
తన మనసులో నుంచి వచ్చిన కథ 'పౌరుషం' అని, ఈ సినిమాలో సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్సులు, భావోద్వేగాలను నిద్రలో లేపి అడిగినా చెబుతానని షెరాజ్ మెహ్ది తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''నేను 'పౌరుషం'కు ముందు ఎనిమిది సినిమాలకు సంగీతం అందించాను. సంగీత దర్శకుడిగా నా తొమ్మిదో చిత్రమిది. ఇందులో హీరోగానూ నటించాను. దర్శకత్వం వహించాను. నిర్మాతలు నాకు పూర్తి మద్దతు అందించారు. నిర్మాత అశోక్ గారికి థ్యాంక్యూ. ఈ రోజు నేను ఈ సినిమా తీశానంటే కారణం అశోక్ సార్. ఒకరి వల్ల మంచి వ్యక్తులు ఇలా ఇబ్బంది పడతారనే మంచి కంటెంట్ ఉన్న చిత్రమిది. రొమాన్స్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా... కమర్షియల్ హంగులు అన్నిటితో సినిమా చేశా. నటీనటులు అందరూ నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. బాగా చేశారు. ప్రపంచంలో మహిళలు లేకుండా మగవాళ్ళు లేరు. ఆడవారి సహకారంతో మగాళ్లు ముందుకు వెళ్ళాలి. మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమాను అందరూ చూడాలని కోరుతున్నాను'' అని చెప్పారు.
Also Read: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
''సినిమా బాగా వచ్చింది. మంచి కంటెంట్ ఉంది. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమా చూడాలని కోరుతున్నాను'' అని నిర్మాత అశోక్ ఖుల్లార్ అన్నారు. 'నేను ఈ సినిమాలో హీరోయిన్ అన్నయ్య పాత్రలో, సుమన్ గారికి కొడుకుగా నటించా. ఆమని గారు మంచి మెసేజ్ ఇచ్చే రోల్ చేశారు. పిల్లలు ఎలా ఉండాలో చెప్పారు. ఇది ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా అంటున్నారు కానీ మా హీరో షెరాజ్ శివతాండవం చేశారు. సైన్స్, దేవుడు వేరు కాదుని, రెండూ ఒకటే అనే పాయింట్ సినిమాలో ఉంది'' అని నటుడు గంగాధర్ తెలిపారు.
Also Read: ఒరిస్సాలో అడుగు పెట్టిన మహేష్... రాజమౌళి సినిమా కోసం, ఆయనతో వెళ్లిందెవరో గుర్తు పట్టారా?
'పౌరుషం' చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అందించడంతో పాటు షెరాజ్ మెహ్ది దర్శకత్వం వహించారు. ఇందులో సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, 'జబర్దస్త్' కెవ్వు కార్తీక్, 'జబర్దస్త్' హీనా, 'జబర్దస్త్' కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: కావేటి ప్రవీణ్, కొరియోగ్రాఫర్ : సాయి రాజ్, సాహిత్యం : బాష్య శ్రీ నిర్మాణ సంస్థలు: UVT హాలీవుడ్ స్టూడియోస్ (USA) - శ్రేయ ప్రొడక్షన్స్, నిర్మాతలు: అశోక్ ఖుల్లార్ - దేవేంద్ర నేగి, సంగీతం - కథ - మాటలు - స్క్రీన్‌ప్లే - దర్శకత్వం: షెరాజ్ మెహ్ది.