Manipur Violence:


జిమ్ సెంటర్ ధ్వంసం


ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. చురచందపూర్‌లో చెలరేగిన హింసతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎవరూ తిరగొద్దని ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి ఎన్ బైరెన్ సింగ్‌ పర్యటనకు ముందు ఈ ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. ఫలితంగా...భద్రతను కట్టుదిట్టం చేశాయి భద్రతా బలగాలు. సీఎం ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేయగా..కొందరు వచ్చి ఆ వేదికను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చిత్తడి నేలలతో సహా...రిజర్వ్డ్ ఫారెస్ట్‌ ప్రాంతాల్లో సర్వే చేయడంపై ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సభపై కొందరు ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక్కడే జిమ్‌, స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్‌ని ప్రారంభించాల్సి ఉంది. అయితే... ఆందోళనకారులు ఈ సెంటర్‌ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. క్రీడా సామగ్రిని కూడా తగలబెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు.  భారీ ఎత్తున ఎవరూ గుమి గూడకుండా జాగ్రత్త పడుతున్నారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 






సర్వే చేస్తే ఊరుకోం...


Indigenous Tribal Leaders బంద్‌కు పిలుపునివ్వడమూ ఉద్రిక్తతకు దారి తీసింది. సోషల్ మీడియాలోనూ ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టకుండా నిఘా పెట్టారు పోలీసులు. మరి సీఎం ప్రోగ్రామ్ ఉంటుందా..? లేదా అన్నది ఇంకా ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. Indigenous Tribal Leaders ఫోరమ్ మొదటి నుంచి ఈ సర్వేని వ్యతిరేకిస్తోంది. ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఫోరమ్ సభ్యులు మండి పడుతున్నారు. ఈ ఫోరమ్‌కి మద్దతుగా మరి కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. గిరిజనుల హక్కులు అణిచివేయాలని చూస్తే ఊరుకునేదే లేదని తేల్చి చెబుతున్నాయి. గత నెల మణిపూర్ ప్రభుత్వం మూడు చర్చ్‌లను కూల్చి వేసింది. అక్రమ నిర్మాణాలుగా తేల్చి వాటిని ధ్వంసం చేసింది. ఇప్పటికే దీనిపై అలజడి రేగింది. ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. 




Also Read: SCO Meeting in Delhi: పాత ఒప్పందాలను గౌరవించాల్సిందే, చైనాకు తేల్చిచెప్పిన భారత్