గుప్పెడంతమనసు ఏప్రిల్ 28 ఎపిసోడ్


శైలేంద్ర ఎంట్రీతో గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రావడంతోనే అరాచకం స్టార్ట్ చేశాడు. దేవయానిని మించి అనిపించేలా ధరణిని టార్గెట్ చేశాడు.భోజనానికి పిలిచేందుకు వెళ్లిన ధరణిని చాలా మాటలంటాడు శైలేంద్ర. అస్సలు నిన్ను చూడాలనే అనిపించదు, నీకోసం గిఫ్ట్ ఏం తెస్తే ఏ ఉపయోగం అంటూ సూటిపోటి మాటలంటాడు. అన్నీ విన్న ధరణి..త్వరగా భోజనానికి రండి అనేసి వెళ్లిపోతుంది. పర్వాలేదు ఎదురు చెప్పడం లేదు అనుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత మీ ఆయన కోసం స్పెషల్ వంటకాలు చేశావా అని అందరూ ఆటపట్టిస్తుంటారు...అదేం లేదన్న ధరణి వడ్డిస్తుంది... నీకు నచ్చిన కూరలు చేసి నాకోసం అంటావా అని మళ్లీ ఫైర్ అవుతాడు. నా ఇష్టాలు నాకుంటాయంటూ ధరణిని టార్గెట్ చేస్తాడు...ఇదంతా విన్న వసుధార ఇదే విషయం జగతికి చెబుతుండగా దేవయాని ఎంట్రీ ఇస్తుంది. 


Also Read: అప్పుడే మొదలెట్టేసిన శైలేంద్ర, రిషిధార మధ్య మొదలైన డిస్కషన్, ధరణికి కొత్త కష్టాలు!
 
దేవయాని: నీకేం తెలుసు నిన్నగాక మొన్నవచ్చినదానివి నువ్వు నా కొడుకుమీద చాడీలు చెబుతున్నావా...నువ్వు ఇక్కడ ఉండడం నాకిష్టం లేదు..కానీ రిషికి నువ్వంటే ప్రేమ ఉండడం వల్ల ఆగుతున్నా..నీ పని నువ్వు చేసుకో..రోడ్డుమీద నా కొడుకునే ఎదిరిస్తావా..వాడిని ఎవ్వరు ఒక్కమాట అన్నా సహించలేను..అలాంటిది నా కొడుకును అన్నిమాటలు అంటావా. నీకెంత ధైర్యం
వసు: తప్పును తప్పు అని చెప్పడానికి ధైర్యం అవసరం లేదు.. 
దేవయాని: నా గురించి నీకు తెలుసు
వసు: తెలుసు మేడం..మీకు కావాల్సింది దక్కించుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు...
దేవయాని: నువ్వు ఇక్కడ ఉండాలంటే నాకు నచ్చినట్టే ఉండాలి
వసు: మీ గురించి తెలుసుకోవాల్సిన వాళ్లు తెలుసుకునేరోజు మీ ఆటలు కట్టేస్తాయి
దేవయాని: ఈ లోగా రిషి పిలవడంతో వసుధార వెళ్లిపోతుంటే..నా గురించి చెబుతావా
వసు: మీ గురించి సార్ తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను..చెప్పడానికి ఇవేం పిల్లల గొడవలు కాదు కదా


Also Read: రిషిని చూసి కుళ్లుకుంటున్న దేవయాని కొడుకు, ఇకపై రిషిధార Vs శైలేంద్ర


ఇంతలో రిషి..వసుధార కోసం వెతుకుతూ ఉంటాడు...అప్పుడే వచ్చిన శైలేంద్ర..నువ్వు ఫ్రీగా ఉన్నట్టున్నావ్ మాట్లాడుకుందాం రా అని పిలుస్తాడు. 
రిషి: నీతో మాట్లాడడం అంటేనే ఫజిల్ సాల్వ్ చేసినట్టు ఉంటుంది
శైలేంద్ర: అందరూ నీ ప్రేమ గురించి కథలు కథలుగా చెబుతుంటే ఏం లేదంటావేంటి...మీడియా ముందు చెప్పావంట..ఎంత గట్స్ ఉండాలి అలా చెప్పాలంటే
రిషి: పరిస్థితులు అలా చెప్పించాయి
శైలేంద్ర: నేను ఫారిన్ వెళ్లకముందు రిషి వేరు..ఇప్పుడు రిషి వేరు..చాలా మారిపోయావ్
రిషి: నువ్వే గెస్ చేయి..
శైలేంద్ర: ప్రేమేనా
రిషి: అవును నువ్వు అడ్వెంచరస్ బోయ్ అన్నావుకదా.. నిజంగా ప్రేమే మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది
శైలేంద్ర: పెళ్లికానివాడు పెళ్లైనవాడికి ప్రేమ పాఠాలు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది..మీ పెళ్లి ఎప్పుడు
రిషి: శూన్యమాసం వెళ్లాక పెద్దమ్మ ముహూర్తాలు చూస్తానంది...సరే అన్నయ్యా ఇప్పుడే వస్తానంటూ వెళ్లిపోతాడు..


వసుధార మేడపై ఎదురుచూస్తుంటుంది...( శైలంద్ర మాటలు గుర్తుచేసుకుంటుంది) ఇంతలో రిషి వస్తాడు..నువ్వు ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావని అడిగితే..నాన్న కాల్ చేశారని చెబుతుంది. నువ్వు కనిపించకపోయేసరికి నాకేం తోచలేదు అందుకే వెతుక్కుంటూ వచ్చాను అంటాడు
వసు: మీ అన్నయ్యా...అని మొదలెడుతుంది
రిషి: మా అన్నయ్య చాలా మంచివాడు..ఇద్దరం కలసే పెరిగాం..అన్నయ్యకి నేనంటేచాలా ఇష్టం అంటూ ఆగకుండా గొప్పగా చెబుతుంటాడు. అన్నయ్య ఇంతకు ముందు పిలిచి మన లవ్ స్టోరీ అడిగాడు..అడ్వెంచరస్ అని పొగిడాడు..అన్నయ్య చాలా హ్యాపీగా ఫీలయ్యాడు
వసు: మీ అన్నయ్య వచ్చారని మీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తోంది..
రిషి: నేను నా అనుకునేవాళ్లు నా చుట్టూ ఉండాలని కోరుకుంటాను
వసు: మీరు నా అనుకునే జాబితాలో నేనున్నానా...
రిషి: మొదటి పేరు నీదే..అంటూ కుటుంబం అంటూ గొప్పగా చెబుతాడు..వదిన చాలా సంతోషంగా ఉంది..నేను చాలా హ్యాపీ


ధరణి వంటింట్లో ఏదో పని చేసుకుంటుంది...ఇంతలో దేవయాని వస్తుంది
దేవయాని: ఈ సర్దడాలు తప్ప ఇంకేం ఆలోచించవా..శైలేంద్ర గురించి ఆలోచించవా..ఇప్పుడు ఏ జ్యూస్ తాగుతాడో తెలుసుకోవా.. నిన్నుకాదు నన్ను అనుకోవాలి..స్నేహాలు బంధుత్వాలు రుణాలు అంటూ నిన్ను నా కొడుక్కి కట్టబెట్టారు...
జగతి: తనని మీ కూతురు అనుకుని ఇలా కోప్పడితే ఎలా
దేవయాని:నీ పాఠాలు కాలేజీలో చెప్పుకో..ఇంట్లోకాదు..నా కోడలికి ఏం నేర్పించాలో నాకు తెలసు..నీ హద్దుల్లో నువ్వు ఉండు పద్ధతిగా ఉంటుంది.. ధరణి నువ్వు టీ పెట్టు
జగతి: టీ ఎందుకు
దేవయాని: నా కొడుక్కి ఈ టైమ్ లో టీ తాగే అలవాటు ఉంది..ఎవరి అలవాట్లు వాళ్లవి అదికూడా ప్రశ్నించాలా..అనేసి ధరణి చేతిలో టీ తీసుకుని వెళ్లిపోతుంది
జగతి: ధరణి..ఆ టీ ఏదో నీతో పంపించవచ్చు కదా..తనెందుకు ఇవ్వడం..ఏంటో ఆ మనస్తత్వం...
ధరణి: ఆయనకు నేను అనుగుణంగా మారేవరకూ ఇలాగే ఉండనీయండి అంటూ జగతిని హగ్ చేసుకుని ఏడుస్తుంది....