Rahul Gandhi Bharat Nyay Yatra:  



14 నుంచి న్యాయ్ యాత్ర..


ఈ నెల 14వ తేదీ నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రను (Bharat Nyay Yatra) ప్రారంభించనున్నారు. మణిపూర్ నుంచి ఈ యాత్ర మొదలు కానుంది. ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే రాహుల్‌కి షాక్‌ ఇచ్చింది మణిపూర్ ప్రభుత్వం. యాత్రకు అనుమతి నిరాకరించింది. ground permission ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘచంద్రతో పాటు మరి కొందరు కీలక నేతలు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్‌ని ప్రత్యేకంగా కలిశారు. యాత్రకు అనుమతినివ్వాలని కోరారు. కానీ..అందుకు బైరెన్ సింగ్ అంగీకరించలేదు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని అనుమతినివ్వలేమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఇలా స్పందించడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు. కాంగ్రెస్ అడిగిన స్థలంలో కాకుండా మరో ప్రైవేట్ ప్లేస్‌లో యాత్ర మొదలు పెటాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని,మళ్లీ అలజడి రేగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరముందని బైరెన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అందుకే భారత్ న్యాయ్ యాత్రకు అనుమతి ఇవ్వలేమని వివరించారు. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మండిపడ్డారు. మణిపూర్‌ని కాదని ఇంకెక్కడి నుంచి యాత్ర మొదలు పెడతామని ప్రశ్నించారు. మణిపూర్‌లోనే మరో చోట నుంచి యాత్రను ప్రారంభిస్తామని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 


"ఇంఫాల్‌లోని ప్యాలెస్ గ్రౌండ్ నుంచి భారత్ న్యాయ్ యాత్ర ప్రారంభించాలనుకున్నాం. కానీ మణిపూర్ ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. అనుమతినివ్వలేదు. తూర్పు నుంచి పశ్చిమం వైపుగా యాత్ర సాగించాలనుకున్నాం. అలాంటప్పుడు మణిపూర్‌ని ఎలా వదులుకుంటాం..? అలా వదిలేసి మేం దేశ ప్రజలకు ఏం సందేశమిస్తాం..? ఎలాగైనా సరే మణిపూర్‌ నుంచే యాత్ర మొదలవుతుంది. కానీ అది ఎక్కడి నుంచి అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం"


- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ 


 






మొత్తం 14 రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. మార్చి 20న యాత్ర ముగియనుంది. 6,200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) కన్యాకుమారి నుంచి మొదలైంది. దాదాపు 12 రాష్ట్రాల మీదుగా 4 వేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగిసింది. దాదాపు 136 రోజుల పాటు రాహుల్ గాంధీ ఈ యాత్ర చేశారు. అయితే...ఫస్ట్ ఫేజ్‌లో పూర్తిగా పాదయాత్ర చేశారు రాహుల్ గాంధీ. ఈ సారి మాత్రం హైబ్రిడ్ మోడ్‌లో సాగనుంది. అంటే...కొంత దూరం వరకూ నడక ద్వారా ఆ తరవాత వాహనాల్లో యాత్ర చేయనున్నారు.


Also Read: పాతికేళ్లలో దేశ రూపురేఖలే మార్చేస్తాం, ఇది భారత్‌కి అమృత కాలం - ప్రధాని మోదీ