Kochi Metro Tickets: మెట్రో ప్యాసింజర్స్‌కి గుడ్‌న్యూస్. ఇకపై వాట్సాప్‌లో కూడా టికెట్‌ బుక్ చేసుకోవచ్చు. ఓ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేస్తే చాలు. క్షణాల్లో టికెట్‌ బుక్ అయిపోతుంది. సింపుల్‌గా స్కాన్‌ చేసి స్టేషన్‌లోకి వెళ్లిపోవచ్చు. అంతే కాదు. వాట్సాప్‌ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. నాన్‌ పీక్‌ అవర్స్‌లో అయితే ఏకంగా 50% డిస్కౌంట్ వచ్చేస్తుంది. డిజిటల్ టికెటింగ్‌ని ప్రోత్సహించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొచ్చి మెట్రో ఈ సర్వీస్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టేషన్‌లలో టికెట్‌ కౌంటర్‌ల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు ప్యాసింజర్స్‌. టికెట్స్ తీసుకోడానికి చాలా సేపు అలాగే నిలబడాల్సి వస్తోంది. ఒక్కోసారి డిజిటల్ పేమెంట్‌ వ్యాలెట్స్‌ సర్వర్స్ పని చేయడం లేదు. ఫలితంగా ఫిజికల్ టికెట్ కోసం అలా క్యూలో నిలబడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్‌లోనే టికెట్ బుక్ చేసుకునేలా వెసులుబాటు తీసుకొచ్చారు మెట్రో రైల్ అధికారులు. Axis Bank తో ఒప్పందం కుదుర్చుకుని ఈ సర్వీస్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రోలోనే కాకుండా..వాటర్ మెట్రో, బస్‌లు, ఆటోరిక్షాలనూ ముందుగానే వాట్సాప్‌లోనే టికెట్‌ బుక్‌ చేసుకునేలా  Kochi-1  కార్డ్‌ని తీసుకురానున్నారు. ఈ ఏడాదిలో రోజుకు కనీసం లక్ష మంది మెట్రో రైళ్లలో ప్రయాణించేలా అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నారు. ఒక్క కార్డ్‌తో ఎన్నో ప్రయోజనాలు కల్పించి ప్రోత్సహించాలని చూస్తోంది. కొచ్చి మెట్రో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 10 కోట్ల మంది ట్రావెల్ చేసినట్టు  Kochi Metro వెల్లడించింది. గతేడాది 86,845 ట్రిప్స్‌ని కవర్ చేసింది కొచ్చి మెట్రో. దీని ద్వారా రూ.96 కోట్ల మేర రెవెన్యూ వచ్చింది. 


ఇప్పటికే వాట్సాప్‌లో మెట్రో టికెట్‌లు బుక్ చేసుకునేలా కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఢిల్లీ మెట్రో (Delhi Metro). PeLocal Fintech Private Limitedతో కలిసి ఢిల్లీ మెట్రో ఈ సర్వీస్‌ని లాంఛ్‌ చేసింది. 9650855800 అనే నంబర్‌కి Hi అని వాట్సాప్ చేయాలి. లాంగ్వేజ్ సెలెక్ట్‌ చేసుకునే ఆప్షన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. హిందీ లేదా ఇంగ్లీష్‌ని ఎంచుకోవచ్చు. ఆ తరవాత "Buy Ticket" ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడే సోర్స్, డెస్టినేషన్ స్టేషన్‌ల వివరాలు ఇవ్వాలి. ఒకవేళ అప్పటికే బుక్‌ చేసుకుని ఉంటే హిస్టరీ కూడా కిందే కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చు. డిటెయిల్స్‌ని కన్‌ఫమ్ చేసిన తరవాత పేమెంట్ గేట్‌వేకి వెళ్తుంది. పేమెంట్ అయిపోగానే టికెట్ QR Code కనిపిస్తుంది. వీటిని మెట్రో స్టేషన్‌లోని ఎంట్రీ గేట్స్ వద్ద స్కాన్ చేసి లోపలకు వెళ్లిపోవచ్చు.  ముందుగా ఢిల్లీలో కొన్ని స్టేషన్లకు మాత్రమే ఈ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. న్యూఢిల్లీ, శివాజీ స్టేడియం, ఢిల్లీ ఏరో సిటీ, ద్వారకా సెక్టార్ 21 లాంటి స్టేషన్లకు వాట్సాప్‌ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మిగతా స్టేషన్లకూ ఈ సర్వీస్‌ని విస్తరిస్తున్నారు. 


Also Read: కొత్త ఎయిర్‌పోర్ట్‌, లిక్కర్ సేల్స్ - టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు లక్షద్వీప్ ప్లాన్