Viral News in Telugu: మీకు మ్యాంగో జ్యూస్ అంటే మహా ఇష్టమా. బయటకు వెళ్లినప్పుడల్లా కొనుక్కుని తాగేస్తున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. మీరు అంతగా లొట్టలేసుకుని తాగే మామిడి పండ్ల రసాన్ని ఎలా తయారు చేస్తున్నారో చూస్తే జన్మలో మళ్లీ దాని జోలికెళ్లరేమో. మ్యాంగో జ్యూస్ తయారు చేసే విధానాన్ని ఓ వ్లాగర్ రీల్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇదంతా చూస్తే అసలు మామిడి పండ్లు లేకుండానే మ్యాంగో జ్యూస్ తయారు చేసేస్తున్నారని ఓ క్లారిటీ వచ్చేసింది. పసుపు రంగులో ఉన్న లిక్విడ్‌ని రెడ్, ఆరెంజ్ ఫుడ్ కలర్స్‌తో మిక్స్ చేసి అందులో షుగర్ సిరప్, కెమికల్స్ కలిపి అదే జ్యూస్ అని అమ్మేస్తున్నారు. మనం కొంటున్నాం. రకరకాల మెషీన్‌లు వాడి ఈ కృత్రిమ పండ్ల రసాన్ని తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన జ్యూస్‌ని అందంగా ప్యాక్ చేసి మార్కెట్‌లోకి వదులుతున్నారు. "టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ చేశాడు వ్లాగర్. వెంటనే ఇది వైరల్ అయిపోయింది. (Also Read: Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ట్రంప్, 78 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా డ్యాన్స్ - వీడియో)
ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. "మ్యాంగో జ్యూస్‌ని ఇలా తయారు చేస్తున్నారా" అని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఇలాంటి నిజాలన్నీ తెలుసుకునే చాలా మటుకు నాకు ఇష్టమైన డ్రింక్స్ అన్నీ తాగడం మానేశాను" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి "అసలు ఇందులో మ్యాంగో పల్ప్ ఎక్కడుంది" అని కామెంట్ పెట్టాడు. "అమ్మో ఇది స్లో పాయిజన్" అని మరొకరు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే..ప్రశాంతంగా ఇంట్లో జ్యూస్‌లు చేసుకుని తాగడం మంచిదని మరికొందరు కామెంట్స్ చేశారు.