Viral News in Telugu: బిజీ మార్కెట్. చుట్టూ జనం. అందరి మధ్యలో నుంచి ఓ వ్యక్తి వచ్చాడు. మెడలో పూలదండ వేసుకున్నాడు. తలపాగా కూడా ఉంది. అందరూ ఆ వ్యక్తి వైపు వింతగా చూస్తున్నారు. ఇంతలో ఓ బట్టల షాప్ ముందు ఆగాడు. ఆ షాప్ ముందు లేడీ డిస్‌ప్లే బొమ్మని చూశాడు. ముద్దు పెట్టాడు. వెంటనే తన చేతిలో ఉన్న మరో దండ తీసి ఆ బొమ్మ మెడలో వేశాడు. ఆ తరవాత కాళ్లకి దండం పెట్టాడు. పెళ్లైపోయిందని చప్పట్లు కొట్టాడు. ఆ తరవాత ఆ బొమ్మని ఎత్తుకుని వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్లంతా ఆ వ్యక్తి చేసిన పనిని చూసి తెగ నవ్వుకున్నారు. నడిరోడ్డుపై ఆ బొమ్మని పట్టుకుని నిలబడ్డాడు ఆ యువకుడు. ఇదంతా మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వెంటనే వైరల్ అయిపోయింది.
అంత రద్దీ ఉన్న మార్కెట్‌లో ఈ పని చేయడం వల్ల అంతా షాక్ అయ్యారు. తరవాత పగలబడి నవ్వుకున్నారు. అందరూ తమ ఫోన్‌లలో అదంతా రికార్డ్ చేసుకున్నారు. కాసేపు అందరినీ నవ్వించిన ఆ యువకుడు మళ్లీ ఆ బొమ్మను తీసుకెళ్లి అదే ప్లేస్‌లో పెట్టాడు. ఇప్పటికే ఈ వీడియో 11 లక్షల వ్యూస్ రాగా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది భలే ఉందంటూ నవ్వుతూ కామెంట్స్ పెట్టగా.. ఇంకొందరు ఇదేం పిచ్చిరా బాబు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.