Man carrying snake asks passengers for money: రైల్లో వెళ్తూంటే అడుక్కునే వాళ్లు రకరకాల విద్యలు ప్రదర్శిస్తారు. కొందరు పాటలు పాడుతారు. కొంత మంది బోగీ క్లీన్ చేస్తారు. మరొకరు మరో విద్య ప్రదర్శిస్తారు. అందరూ జాలిగా ఎంతో కొంత డబ్బులిస్తారని అనుకుంటారు. కానీ కొంత మంది తెలివిమీరిపోయిన వారు ఉంటారు. వారు భయపెట్టి డబ్బులు తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాడే ఈ ్యక్తి.
అహ్మదాబాద్‌కు వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక వ్యక్తి పామును చేతిలోకి తీసుకొని ప్రయాణికులను భయపెట్టి డబ్బు డిమాండ్ చేసిన సంఘటన వైరల్ అయింది. మధ్యప్రదేశ్‌లోని ముంగావలి జంక్షన్ వద్ద రైలు బయలుదేరిన తర్వాత జరిగిన పాము చుట్టుకొని ప్రయాణికుల ముఖాలకు సమీపంగా తీసుకెళ్లి డబ్బులు ఇవ్వాలని అడుక్కోవడం ప్రారంభించాడు. భయపడిన కొందరు ప్రయాణికులు డబ్బు ఇచ్చి తప్పించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందడంతో రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
సబర్మతి ఎక్స్‌ప్రెస్ మధ్యప్రదేశ్‌లోని ముంగావలి జంక్షన్ వద్ద ఆగిన తర్వాత ఈ వ్యక్తి రైలులోకి ప్రవేశించాడు. ప్రయాణికుల ముఖాలకు సమీపంగా పామును తీసుకెళ్లి "డబ్బు ఇవ్వండి" అని డిమాండ్ చేశాడు. వీడియోలో కనిపించినట్లుగా, ప్రయాణికులు భయపడి, అసౌకర్యంగా కనిపించారు. కొందరు తమ జేబుల నుంచి నోట్లు తీసి అతనికి ఇచ్చారు. ఈ పాము విషము లేని రకం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు, కానీ దాని రూపం చూసి ప్రయాణికులు భయపడ్డారు.
వీడియో వైరల్ కాగానే రైల్వే సేవా X అకౌంట్ త్వరగా స్పందించింది. రైల్వే అధికారులు "ఇలాంటి అనధికారిక వ్యక్తులు రైల్వేలోకి ప్రవేశించకుండా గ్రిష్టమైన చర్యలు తీసుకుంటాము" అని ప్రకటించారు. RPF ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, వీడియో ఆధారంగా వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది.