Aamir Khan Partner Gauri Spratt Gets Angry At Paps: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ సహనం కోల్పోయారు. రోడ్డుపై వాకింగ్ వెళ్తుండగా ఆమెను ఫోటోస్ తీసేందుకు వెంబడించిన ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు ఫోటోలు వద్దంటూ చెప్తున్నప్పటికీ కొందరు ఆమెను వెంబడించారు.
ఈ క్రమంలో గౌరీ స్ప్రాట్ వారితో... 'అరే నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను వాకింగ్ కోసం వెళ్తున్నా.' అంటూ చెప్పారు. దీంతో ఫోటోగ్రాఫర్లు ఆమెకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఒకరి అనుమతి లేకుండా ఫోటోలు తీయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అంటున్నారు. గతంలో స్టార్ హీరోయిన్ సమంత, పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఇలా ఫోటోగ్రాఫర్లు అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో ఇబ్బంది పడ్డారు.
ఆమిర్ ఖాన్ తన బర్త్ డే సందర్భంగా మార్చిలో గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్‌ను పరిచయం చేశారు. 25 ఏళ్ల కిందట వారిద్దరూ కలుసుకోగా ఆ తర్వాత ఆమె టచ్‌లో లేకుండా పోయారని... రెండేళ్ల క్రితమే ఆమెను కలిసినట్లు అప్పట్లో చెప్పారు. ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు సీక్రెట్ రివీల్ చేశారు. దీంతో అప్పటి నుంచి ఆమె సెలబ్రిటీ అయిపోయారు. అసలు ఎవరీ గౌరీ స్ప్రాట్ అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. ఆ రెండు రోజులూ ఇదే ట్రెండింగ్ మారింది. ఆమె కోసం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా అరేంజ్ చేశారు ఆమిర్.
ప్రముఖ స్టైలిష్ట్ రీటీ స్ప్రాట్ కుమార్ గౌరీ స్ప్రాట్. బ్లూ మౌంటెన్ స్కూల్‌లో చదువుకున్న గౌరీ... ఆ తర్వాత ఫ్యాషన్ కోర్స్ పూర్తి చేసి లండన్ వర్శిటీలోని ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీలో ట్రైనింగ్ తీసుకున్నారు. ముంబయిలోని బీటౌన్ సెలబ్రిటీలంతా వచ్చే బీబ్లంట్ అనే సెలూన్ నడుపుతున్నారు. ఆమె ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థలో హెల్పర్‌గా పని చేస్తున్నారు.