Dies After Drinking 5 Bottles Liquor: కాస్త వయసు వచ్చాక మద్యం తాగడం అనేది హీరోయిజం అనుకుంటారు. ఎవరు ఎక్కువ తాగితే వారు గొప్ప అనుకుంటారు. ఈ క్రమంలో పందేలు వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కార్తీక్ అనే యువకుడు అలాగే కోల్పోయాడు.
కర్ణాటకలో నివాసం ఉంటే 21 ఏళ్ల కార్తీక్ ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. ఓ రోజు తన స్నేహితులతో కలిసి రూ.10,000 పందెం వేసి ఐదు బాటిళ్ల మద్యం తాగుతానని సవాల్ చేశాడు. కార్తీక్ తన స్నేహితులైన వెంకట రెడ్డి, సుబ్రమణి మరియు మరో ముగ్గురికి మద్యంలో నీరు కలపకుండా ఐదు ఫుల్ బాటిళ్ల మద్యం తాగవచ్చని చెప్పాడు. అలా చేయగలిగితే రూ.10,000 ఇస్తానని వెంకట రెడ్డి కార్తీక్‌తో బెట్టింగ్ కట్టాడు.
కార్తీక్ ఐదు బాటిళ్లను గటగటా తాగేశాడు కానీ ఆ వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కోలార్ జిల్లాలోని ముల్బాగల్‌లోని ఒక ఆసుపత్రిలో స్నేహితులు చేర్పించారు. చికిత్స సమయంలోనే అతను మరణించాడు.
కర్ణాటకలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. కార్తీక్ కు పెద్దగా ఉద్యోగం లేకపోయినా.. తల్లిదండ్రులు వివాహం చేశారు. ఒక సంవత్సరం కిందట పెళ్లి అయిన అతను ఎనిమిది రోజుల కిదంట తండ్రి అయ్యాడు. అతని భార్య ఎనిమిది రోజుల క్రితమే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డ పుట్టగానే తండ్రి లేని వాడయ్యాడని బంధువులు రోదిస్తున్నరు.
మద్యం బెట్టింగ్ కట్టిన వెంకట రెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురు వ్యక్తులపై నంగలి పోలీస్ స్టేషన్‌లో పోలీసు కేసు నమోదైంది. ఇద్దరినీ అరెస్టు చేశారు, పోలీసులు ఇతర నిందితుల కోసం వెతుకుతున్నారు.
బాధ్యత తెలియని తనం వల్ల చేసిన తప్పుల వల్ల అతని కుటుంబం రోడ్డున పడింది. పెళ్లి అయిన ఏడాదికే.. ఆ భార్య భర్తను కల్పోయింది. ఓ బిడ్డను ఇప్పుడు ఆమె ఏ ఆధారం లేకుండా పోషించాల్సి ఉంది.