Mamata Suvendu Meet: ప్రస్తుతం ఉప్పు- నిప్పుగా ఉన్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ, భాజపా నేత సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. గత ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించిన తర్వాత వీరు ఇరువురూ ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి.
మమతా బెనర్జీ.. భాజపా నేత సువేందును బంగాల్ అసెంబ్లీలో ఈ శుక్రవారం కలిశారు. సమాచారం ప్రకారం మమతా.. సువేందు అధికారిని కలవాలని వర్తమానం పంపడంతో వారి మధ్య ఈ సమావేశం జరిగింది. దాదాపు 2 నిమిషాల పాటు ఇది కొనసాగింది. సువేందుతోపాటు భాజపా ఎమ్మెల్యేలు అగ్నిమిత్ర పాల్, మనోజ్ టిగ్గా కూడా హాజరయ్యారు.
దీదీ ఏమన్నారంటే
ఇటీవల జరిగిన గవర్నర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం గురించి మమతా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భాజపా గైర్హాజరైంది.
ఓటమి
గత ఏడాది జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి పోటీ చేశారు. సువేందు అధికారి.. మమతాపై విజయం సాధించారు. తొలుత ట్రెండ్స్‌లో సువెందు అధికారి 1200 ఓట్లు వెనుకంజలో ఉండగా.. చివర్లో పుంజుకొని 1900 ఓట్ల ఆధిక్యంతో మమతా బెనర్జీపై విజయం సాధించారు.
Also Read: Saudi Arabia Floods: ఎడారి దేశంలో వరద బీభత్సం- 13 ఏళ్ల నాటి సీన్ రిపీట్!