Maharashtra tops India FDI second time in a row : తమ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటూనే ఉంటుంది. పెట్టబడిదారులు కూడా పారిశ్రామికంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడుతూంటారు. ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే తమ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని నమ్మకంతో ఉంటారు. ఈ ఆర్థికత సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆకర్షించింది.
వరద నీళ్లలో కారు మునిగితే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది? ఎలా క్లెయిమ్ చేయాలి?
ఈ ఆర్థిక సంవత్సరంలో దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 52 శాతం మహారాష్ట్రకే వెళ్లాయి. మామూలుగా అయితే పెట్టుబడుల సాధనలో గుజరాత్ లేదా కర్ణాటక అగ్రస్థానంలో ఉంటుంది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర మందుకు వచ్చింది. మొత్తంగా 70, 795 కోట్ల రూపాయలు మహారాష్ట్రకు పెట్టుబడులుగా వచ్చాయి. తర్వాత స్థానంలో కర్ణాటక నిలిచింది. అయితే మహారాష్ట్రకు.. కర్ణాటకకు వచ్చిన పెట్టుబడుల విలువలో ఎంతో గ్యాప్ ఉంది. కర్ణాటకకు వచ్చింది రూ. 19,059 కోట్ల పెట్టుబడులు మాత్రమే. మూడో స్థానంలో ఢిల్లీ రూ. 10,788 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి నిలిచింది. ఇక నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 9 వేల కోట్ల రూపాయలకుపైగా వచ్చాయి. తర్వాత వరుసగా గుజరాత్, తమిళనాడు, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలున్నాయి. టాప్ టెన్‌లో చివరిలో ఉన్నరాజస్థాన్‌కు వచ్చిన పెట్టుబడులు రూ. 311 కోట్లు మాత్రమే. అంటే మిగతా పందొమ్మిది రాష్ట్రాలకు ఆ మాత్రం పెట్టుబడులు కూడా రాలేదని అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం జూన్ లో ఏర్పడింది. ఈ లెక్కలన్నీ జూన్ వరకు వచ్చినవే. జూన్ తర్వాత అనేక పెట్టుబడుల ప్రతిపాదనలకు.. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తర్వాత త్రైమాసికాల్లో ఏపీలోనూ మంచి పెట్టుబడులు వస్తాయని భావిస్తన్నారు.
భారీగా దిగొచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
మరో వైపు ఈజ్ ఆఫ్డ డూయింగ్ బిజినెస్‌లో కేరళ మొదటి స్థానంలో ఉన్నట్లుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణకు అసలు జాబితాలో చోటు లేదని.. తాము చాలా కాలంగా మంచి పారిశ్రామిక విధానాలతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ముంటున్నామని ఇప్పుడు అలాంటిదేమీ లేకండా చేస్తున్నారని కేటీఆర్ రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేరళ ముందొచ్చినా.. టాప్ టెన్ పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రాల్లో కేరళ లేదు.