Just In





Maharashtra Assembly Session: చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
Maharashtra Assembly Session: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఎన్‌సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన చంటి బిడ్డతో సమావేశాలకు హాజరయ్యారు.

Maharashtra Assembly Session: మహారాష్ట్రలో సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాల్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన నాసిక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సరోజ అహిరే తన రెండున్నర నెలల పసికందుతో అసెంబ్లీకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇదీ సంగతి
చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేతో పాటు తన భర్త, అత్త కూడా చంటి బిడ్డను చూసుకోవడానికి అసెంబ్లీకి వచ్చారు. సభకు హాజరయ్యే ముందు ఎమ్మెల్యే సరోజ అహిరే విలేకర్లతో మాట్లాడారు.
దాదాపు రెండున్నర సంవత్సరాల తరవాత నాగపుర్‌లో మహరాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని భాజపా- శివసేన (ఏక్‌నాథ్ శిందే వర్గం) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు గత ఆదివారం జరిగిన సంప్రదాయ తేనేటి విందును బహిష్కరించాయి.
Also Read: Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!