Maharaj visits 12 homes daily earns Rs 2 lakh: మహరాజ్ రోజూ పది నుంచి పన్నెండు ఇళ్లకు వెళ్తాడు. ఏ ఇంట్లోనూ అరగంటకు మించి ఉండడు. కానీ కానీ ఖచ్చితంగా నెలకు పద్దెనిమిది వేలు వసూలు చేస్తాడు. ఇంతకీ అతనేం చేస్తాడంటే.. వంట చేస్తాడు.
ఓ లాయర్ తమ ఇంట్లో వంట చేసే మహరాజ్ గురించి ట్విట్టర్ లో వేసిన పోస్టు వైరల్ గా మారింది. ముంబైలోని న్యాయవాది పని చేస్తున్న అయూషి దోషి తన వంటవాడు నెలకు రూ. 2 లక్షలు సంపాదిస్తున్నాడని, అతని సమర్థత మరియు పని షెడ్యూల్ గురించి Xలో పోస్ట్ చేసింది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చను రేకెత్తించింది. అయూషి దోషి చెప్పిన ప్రకారం ఈ కుక్ రేోజుకు 10-12 ఇళ్లలో పనిచేస్తాడని తెలిపింది. ఒక్కో ఇంటికి నెలకు రూ. 18,000 వసూలు చేస్తాడు. ఒక్కో ఇంటిలో గరిష్టంగా 30 నిమిషాలు గడుపుతాడు, కొన్ని ఇళ్లలో 60 నిమిషాల వరకు ఉండవచ్చు, ఇది కుటుంబ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 10-12 ఇళ్ల నుంచి నెలకు రూ. 1.8 లక్షల నుంచి రూ. 2.16 లక్షల వరకు సంపాదిస్తాడు. ప్రతి ఇంటిలో ఉచితంగా టీ మరియు భోజనం అందిస్తారు. చెల్లింపులలో జాప్యం జరిగితే కనీసం గుడ్ బై కూడా చెప్పడట. ఈ వంటవాడు తన పనిలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాడు. ఒకే కాలనీలో 10-12 ఇళ్లలో పనిచేయడం వల్ల అతను రవాణా సమయాన్ని తగ్గించుకుని, ఎక్కువ సంఖ్యలో ఇళ్లను కవర్ చేయగలుగుతాడు. ముంబైలోని మంచి నివాస ప్రాంతాల్లో ఇలాంటి ఛార్జీలు సాధారణమని, అయితే అన్ని వంటవాళ్లు రూ. 18,000 వసూలు చేయరని, కొందరు రూ. 10,000-12,000 కూడా ఛార్జ్ చేస్తారని తెలిపింది. మహరాజ్ తన నైపుణ్యం మరియు ఖ్యాతి కారణంగా ప్రీమియం ఛార్జీలు వసూలు చేయగలుగుతున్నాడని, ఇళ్ల యజమానులు అతని నాణ్యత , సమర్థత కారణంగా ఈ ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పింది.
ఆమె తన పోస్ట్ ద్వారా కార్పొరేట్ ఉద్యోగులతో పోల్చితే, ఈ వంటవాడు తన నైపుణ్యంతో స్వంత షెడ్యూల్‌ను నిర్వహిస్తూ, మంచి సంపాదనతో ప్రశాంత జీవితం గడుపుతున్నాడని చెప్పుకొచ్చింది. అయితే ఈ పోస్టుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కానీ ఏఐతో ఎఫెక్ట్ కాని స్వయం ఉపాధి అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు.