SUV Launch In August 2025: భారతదేశంలోని పాపులర్ కార్ కంపెనీలు ఈ నెలలో (ఆగస్టు 2025) కొత్త వాహనాలను లాంచ్ చేయబోతున్నాయి. SUV & ఎలక్ట్రిక్ విభాగంలో హై రేంజ్ డిమాండ్‌కు అనుగుణంగా.. వోల్వో, మెర్సిడెస్, మహీంద్రా & విన్‌ఫాస్ట్ వంటి కంపెనీలు కొత్త మోడళ్ల ఓవర్‌లుక్ అందించాయి. మీరు ఆగస్టులో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది.
1. వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు ప్రారంభంలోనే భారతీయ మార్కెట్లోకి రాబోతోంది. ఈ కారులో కొత్త గ్రిల్ డిజైన్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్-లైట్లు & కొత్త బాడీ కలర్స్ వంటి చిన్నపాటి ఎక్స్‌టీరియర్ మార్పులు ఉన్నాయి. దీని ఇంటీరియర్‌లో అతి పెద్ద మార్పు 11.2-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇది క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌పై నడుస్తుంది, మునుపటి కంటే రెండు రెట్లు వేగంగా ఉంటుంది. ఇంజిన్‌లో మార్పు లేదు, అదే 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 250hp పవర్ ఇస్తుంది & 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్మూత్‌గా పరుగెడుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD) SUV అవుతుంది.
2. మెర్సిడెస్-AMG CLE 53 కూపే CLE 300 కాబ్రియోలెట్ వెర్షన్ కంటే మెరుగ్గా ఉండే ప్రీమియం స్పోర్ట్స్ కారు 'మెర్సిడెస్ AMG CLE 53 కూపే'. ఇది పాన్-అమెరికానా గ్రిల్, ఫ్లేర్డ్ ఫెండర్లు, గ్లోస్-బ్లాక్ డిఫ్యూజర్ & నాలుగు ఎగ్జాస్ట్ పైపులతో స్పోర్టీ డిజైన్‌తో వస్తోంది. ఇంటీరియర్‌లో.. 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే & అల్కంతారా మెటీరియల్‌తో (ఇదొక లగ్జరీ మెటీరియల్) చేసిన AMG స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుది. 64 కలర్ యాంబియంట్ లైటింగ్ & వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో సహా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.
3. కొత్త మహీంద్రా కాంపాక్ట్ SUV మహీంద్రా తన కొత్త కాంపాక్ట్ SUVని ఆగస్టు 15న విడుదల చేయబోతోంది, ఇది కంపెనీ కొత్త 'nu' మోనోకోక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారైంది. ఈ వాహనం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది & బొలెరో లేదా XUV 3XO కంటే భిన్నమైన డిజైన్ & ఫీచర్లతో లాంచ్ అవుతుంది. ఇటీవల దీని టెస్టింగ్ ప్రోటోటైప్ కనిపించింది, దీనిలో థార్ రాక్స్‌ను పోలి ఉండే డిజైన్ కనిపించింది. ఈ కారుకు 1.2-లీటర్ పెట్రోల్ లేదా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండవచ్చు & భవిష్యత్తులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా జోడించవచ్చు.
4. మహీంద్రా విజన్ కాన్సెప్ట్ సిరీస్ మహీంద్రా, ఆగస్టు 15నే, తన Vision కాన్సెప్ట్ కార్ సిరీస్‌ను ప్రదర్శించబోతోంది. ఈ నాలుగు కాన్సెప్ట్‌లకు SXT, X, T & S అని పేర్లు పెట్టింది. Vision SXT అనేది థార్ లాగా బలమైన SUV కావచ్చు. Vision X అనేది XEV 7e మోడల్‌కు కాంపాక్ట్ వెర్షన్ కావచ్చు. Vision T అనేది ఎలక్ట్రిక్ థార్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ కావచ్చు & Vision S అనేది స్కార్పియో కొత్త వెర్షన్ అని భావిస్తున్నారు. వాటి పవర్‌ట్రెయిన్, లాంచ్ తేదీ & లక్షణాల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ డిజైన్ గురించి చాలా స్పష్టంగా తెలుస్తోంది.
5. విన్‌ఫాస్ట్ VF7వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ VinFast, తన మొదటి కారు VF7 తో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. 4,545 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ SUV ప్రీమియం క్రాస్-ఓవర్ డిజైన్‌తో వస్తుంది. దీనికి 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ & 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు & లెవెల్ 2 ADAS తో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చారు. ఈ కారుకు 70.8kWh LFP బ్యాటరీ ఉంది, ఇది 7.2kW AC & CCS2 DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ కారు రెండు వెర్షన్లలో వస్తుంది - 204hp FWD & 350hp AWD. వీటి డ్రైవింగ్ రేంజ్ వరుసగా 450 కి.మీ. & 431 కి.మీ.