Actress Kalpika Ganesh Father Files Complaint On His Daughter: హీరోయిన్ కల్పికా గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో పలు వివాదాల్లో ఆమెపై కేసులు నమోదయ్యాయి. తాజాగా... తండ్రి సంఘవార్ గణేష్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన కూతురికి మెంటర్ డిజార్డర్ అంటూ ఆయన కంప్లైంట్‌లో పేర్కొన్నారు.

రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించింది

కల్పిక గత కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధ పడుతుందని తండ్రి ఫిర్యాదులో తెలిపారు. 'ఇప్పటికే కల్పిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించాం. అయితే, అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేసింది. డాక్టర్స్ సూచించిన మెడిసిన్స్ కూడా రెండేళ్ల క్రితమే ఆపేసింది. డిప్రెషన్‌కు లోనై ఇంట్లో తరచూ గొడవలు సృష్టిస్తోంది. కుటుంబానికి ఆమె హానికరం అనే పరిస్థితి వచ్చింది. దయచేసి మళ్లీ ఆమెను రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించండి.' అంటూ ఆయన పోలీసులను కోరారు.

ఈ ఫిర్యాదుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. కన్న తండ్రే ఆమెపై ఫిర్యాదు చేయడం అంటే ఆందోళన కలిగించే విషయమేనని... కల్పిక మానసిక స్థితి క్షీణించినట్లు తెలుస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు వెంటనే వైద్య సహాయం అవసరమని... రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించాలని అంటున్నారు.

Also Read: 'కింగ్డమ్' కలెక్షన్స్... విజయ్ దేవరకొండ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్? మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వరుస వివాదాలు

కల్పిక గణేష్‌‌కు వివాదాలు కొత్త కాదు. గతంలో ప్రిజం పబ్ యాజమాన్యంపై ఆమె కేసు పెట్టారు. తనతో తప్పుగా ప్రవర్తించారంటూ పబ్ యాజమాన్యంపై పోలీసుల ఎదుటే బూతులతో రెచ్చిపోయారు. ఈ వీడియోలో అప్పట్లో నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, బిల్ చెల్లించకుండా తమ సిబ్బందిపై కల్పిక దుర్భాషలాడారని... అత్యాచారం, అసభ్యంగా ప్రవర్తించారంటూ తమపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. క్ల‌బ్‌లో సామగ్రి ధ్వంసం చేశారని అన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద ఆమెపై కేసులు నమోదయ్యాయి.

రీసెంట్‌గా నగర శివారులోని ఓ రిసార్ట్‌లోనూ కల్పిక నానా హంగామా సృష్టించింది. రిసార్ట్ మేనేజర్‌తో పాటు సిబ్బందిపై దుర్భాషలాడుతూ హల్చల్ చేసింది. సిగరెట్ అడిగితే కనీసం పట్టించుకోలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా... దానిపై తర్వాత వివరణ ఇచ్చింది. ప్రశాంతత కోసం అక్కడికి వెళ్లినా అక్కడ కూడా అది లేకుండా చేశారని చెప్పింది. దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేశారు. కేవలం సిగరెట్ కోసం రిసార్డ్ సిబ్బందితో అలా ప్రవర్తించడం ఏంటంటూ మండిపడ్డారు. తాజాగా... ఇప్పుడు కన్న తండ్రే ఆమెపై ఫిర్యాదు చేయడంతో కల్పిక రీహాబిలిటేషన్  సెంటర్‌లో చేరాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కల్పిక గణేష్ రామ్ చరమ్ 'ఆరెంజ్' మూవీలో జెనీలియా ఫ్రెండ్‌గా తన నటనతో మెప్పించారు. ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జులాయి, సారొచ్చారు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, హిట్ ఫస్ట్ కేస్, పడి పడి లేచె మనసు వంటి చిత్రాల్లో నటించారు.