Attack on IIT Baba: తీవ్ర వాదోపవాదాలు చేసుకుని టీవీ స్డూడియోల్లో కంట్రోల్ తప్పిపోయి కొట్టుకునే రాజకీయ నేతల ను చాలా చోట్ల చూసి ఉంటాం. అయితే ఇప్పుడు ఇలా అభిప్రాయ భేదాలు ముదిరిపోయి తన్నుకునే వారి జాబితాలో  రాజకీయ నేతలతో పాటు.. స్వామిజీలు కూడా చేరారు. వారు కూడా తాము చెప్పిందే కరెక్ట  అని వాదించడమో.. ఎదురువారు చెబుతోంది తప్పు అని నిరూపించడానికో దాడులకు తెగబడుతున్నారు. కొన్ని సార్లు తమ ఎదురుగా ఉన్న బాబాకు పేరు వచ్చేస్తుందని కూడా ఈర్ష్యతో దాడి చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి నోయిడాలో చోటు చేసుకుంది.                   

మహాకుంభ మేళా సమయంలో సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది వైరల్ అయ్యారు.అలాంటి వారిలో ఒకరు అభయ్ సింగ్. ఆయన ఐఐటీలో చదువుకున్నారు. తర్వాత సన్యాసం పుచ్చుకున్నారు. కుంభమేళాలో చాలా మంది దృష్టిని ఆకర్షించారు. చివరికి ఆయనకు ఐఐటీ బాబా అని పేరు పెట్టారు. ఇది క్యాచీగా ఉండటం.. ఆయన చాలా మందికి జాతకాలు చెప్పడం ప్రారంభించడంతో వైరల్ అయ్యారు. ఆయనకు దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. మీడియా చానళ్లు, యూట్యూబ్ చానళ్లకు ఆయన ఇప్పుడు హాట్ ఫేవరేట్. చాలా మంది ఆయనను తమ చర్చలకు పిలుస్తూంటారు.                  

చాంపియన్స్ ట్రోఫిలో పాకిస్తాన్, భారత్ మ్యాచ్ లో .. ఈ సారి భారత్ గెలవడానికి అవకాశమే లేదని పాకిస్తాన్ గెలుస్తుదంని కుండబద్దలు కొట్టారు. అయితే ఇండియా సూనాయాసంగా గెలిచింది. దీంతో అందరూ ఐఐటీ బాబాను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆయన కూడా తాన లెక్క తప్పిందని ఒప్పుకున్నారు. దీనిపై పలు యూట్యూబ్ చానళ్లు.. ఇతరులు ఆయన అభిప్రాయం తెలుసుకుంటూ వస్తున్నారు. ఆయన సన్యాసంపైనే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఈ క్రమంలో నోయిడాలోని ఓ చానల్ ఆయనతో పాటు.. ఇతర స్వామిజీలను కూడా పిలించి చర్చ పెట్టింది.            

అసలు ఐఐటీ బాబా ఎక్కడ సన్యాసం తీసుకున్నారు..సన్యాసం తీసుకుని ఏం నేర్చుకున్నారు.. ఇతరులకు హిందూత్వ పాఠాలు చెప్పడానికి అసలు నీకేం తెలుసు వంటి ప్రశ్నలను ఐఐటీ బాబాపై ఆ కార్యక్రమంలో సంధించారు. అయితే ఈ విషయంలో  ఆయన ఇతర బాబాలకు సమాధానం ఇచ్చే అంశంలో వివాదం ఏర్పడింది. దాంతో ఐఐటీ బాబా బయటకు వెళ్లిపోయారు. అయితే తనపై ఇతర  బాబాలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. స్డూడియోలో జరిగిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.         

Also read: ఇడ్లీ సాంబార్ వల్ల గోవా టూరిజం పడిపోయింది- బిజెపి ఎమ్మెల్యే కొత్త నిర్వచనం