Boatman istory Sheeter:  మహాకుంభమేళా వైభవంగా జరిగింది. వేల కోట్ల వ్యాపారం జరిగిందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప్రకటించారు.  ఇందుకు ఉదాహరణగా ఆయన ఓ బోట్ మ్యాన్ గురించి చెప్పారు. ఆయన కుటుంబం నెలలో ముఫ్పై కోట్లు సంపాదించిందని.. ఇలా ఎంతో మంది ఆర్థికంగా బాగుపడ్డారన్నారు. దీంతో పింటూ మహారా అనే బోట్ మ్యాన్ జాతీయంగా వైరల్ అయ్యారు. ఇప్పుడు ఆయన గురించి తెలుస్తున్న అసలు నిజం ఏమిటంటే.. ఆయన పెద్ద హిస్టరీ షీటర్, జంట హత్తుల కేసులతో పాటు చాలా నేరాలు ఆయనపై ఉన్నాయి. 

సాధారణ బోట్ మ్యాన్ 30 కోట్లు సంపాదించాడని యోగి ప్రశంస            

ఆ కుటుంబం తమకు ముఫ్పై కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం లేదు.  వారు తమ వద్ద 130 పడవలు ఉన్నాయని చెబుతున్నారు. ఎంత ఆదాయం వచ్చిందో మాత్రం రచెప్పలేదు. యోగి ఈ కుటుంబం గురించి చెప్పడంతో అందరూ పింటూ మహారా గురించి ఆరా తీశారు.  ఆ కుటుంబానికి ఊహించనంత నేర చరిత్ర ఉంది. చాలా మంది తీవ్ర నేరాలు చేసి జైలుకెళ్లారు. తీవ్రమైన సెక్షన్ల కింద నమోదైన 21 క్రిమినల్ కేసుల్లో పింటు పేరు కూడా ఉంది.  గూండా చట్టం , గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అతనిపై రెండుసార్లు చర్యలు తీసుకున్నారు. అంతే కాదుఆధిపత్య పోరాటంలో వీరి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు హత్యకు గుయ్యారు.  చుట్టుపక్కల ప్రాంతంలో బెదిరింపులు ,మాఫియా ఇమేజ్ ఈ కుటుంబానికి ఉంది.                 

బోట్ మ్యాన్ పింటూ కుటుంబం అంతా నేరస్తులే            

పింటు మహారాపై హత్య, దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. పింటుపై మొదటి కేసు 2005లో నమోదైంది. అప్పుడు అతనికి 23 సంవత్సరాలు. అతనికి హత్య, హత్యాయత్నం  దోపిడీతో సహా 21 తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు చెబుతున్నారు. పలుమార్లు జైలుకు వెళ్లాడు.  చాలా సంవత్సరాలు జైలులో ఉన్న తర్వాత  ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలులో ఉన్నప్పుడు  కూడా అతను బెదిరింపులు కొనసాగించాడు. ఈ విషయం తెలియడంతో అతన్ని వేరే జైలుకు తరలించారు. పింటూపై హిస్టరీ షీట్ ప్రయాగ్‌రాజ్‌లోని నైని పోలీస్ స్టేషన్‌ ఉంది.             

మాఫియా పోరాటంలో పింటూ కుటుంబసభ్యులు కూడా హతం 

పింటు తండ్రి రామ్ సహరే అలియాస్ బచ్చా మహారా ఒక క్రూరమైన నేరస్థుడని పోలీసులు చెబుతున్నారు. ఆయన జైల్లోనే చనిపోయాడు.  పింటూ అన్నయ్య ఆనంద్ మహారా కూడా ఒక క్రూరమైన నేరస్థుడని.. అతను గ్యాంగ్ వార్ లో చనిపోయాడని పోలీసు రికార్డుల్లో ఉంది.  క్రిమినల్ రికార్డులతో పాటు, పింటు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున మొత్తం పడవ  సిండికేట్ నడుపుతున్నాడు.ఇతర పడవలు నడిపేవారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు.  పింటు తల్లి శుక్లవతి దేవి విద్యుత్ శాఖలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్. ఆమెకు చాలా పనులు .. కుంభమేళా సందర్భంగా దక్కాయి.