TGPSC Group1 Results: హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడులయ్యాయి.  563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిర్వహించింది. టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆ మార్కుల వివరాలను సోమవారం విడుదల చేశారు. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల నుంచి రీకౌంటింగ్‌ నిర్వహించిన అనంతరం 1:2 నిష్పత్తిలో తరువాత జాబితా వెల్లడిస్తారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు.


గ్రూప్-1 ఆరు పేపర్లలో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితాతో పాటు సబ్జెక్టుల వారీగా స్కోర్ చేసిన మార్కులను అభ్యర్థుల హాల్ టికెట్, డేటాఫ్ బర్త్ వంటి వ్యక్తిగత లాగిన్‌లో పొందుపరిచింది.   మార్చి 11న గ్రూప్ 2 ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 20లోపు అన్ని పరీక్షల ఫలితాలు విడులకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో ఎగ్జామ్ ఫలితాలను వరుసగా విడుదల చేసి, నిరుద్యోగుల కలను సాకారం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చెప్పింది. చెప్పినట్లుగానే సోమవారం నాడు గ్రూప్ 1 ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది వరకు పోటీ పడుతున్నారు. రిజర్వేషన్ ప్రకారం చూస్తే వ్యత్యాసం కనిపిస్తుంది.


గ్రూప్ 1 మార్కుల కోసం క్లిక్ చేయండి https://websitenew.tspsc.gov.in/checkMarksObtainedBytheCandidate?accessId=GRPACEOQ2412


మార్కుల రీకౌంట్ కోసం క్లిక్ చేయండి https://websitenew.tspsc.gov.in/candidateMarksRecounting?accessId=GRPACEOQ2412 


తెలంగాణలో ఒక్కసారి కూడా పూర్తికాని గ్రూప్ 1 ఖాళీల భర్తీ


తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్కసారి కూడా రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ అయిన గ్రూప్ 1 పోస్టుల భర్తీ జరగలేదు. రెండు సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ బీఆర్ఎస్ హయాంలో నిర్వహించారు. కానీ సాంకేతిక కారణాలతో ఓసారి, పేపర్ లీకులతో మరోసారి పరీక్ష నిర్వహించాక రద్దు చేశారు. ఎన్నికలు జరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఫలితాలు వచ్చాక అక్టోబర్ లో మెయిన్స్ నిర్వహించి, మార్చి 10న ఫలితాలు విడుదల చేసింది. మార్కులు చెక్ చేసుకుని, అభ్యంతరాలు ఉంటే చెకింగ్ కు అప్లై చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఆ ప్రక్రియ పూర్తయితే పూర్తి మెరిట్ తో 1:2 జాబితా రిలీజ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు ఆహ్వానిస్తారు. అంతా పూర్తయితే పోస్టులకు ఎంపికైన వారితో తుది జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేస్తుంది.


Also Read: TGPSC: టీజీపీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, గ్రూప్-1,2,3 రిజల్ట్స్ ఎప్పుడంటే? 



నెక్ట్స్ గ్రూప్ 2, 3 ఫలితాలు
2024 ఫిబ్రవరి 19న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా గతేడాది జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరితో పాటు హైకోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి పొందిన వారితో కలిపి 31,403 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. ఒక్కో పేపరును రెండుసార్లు వాల్యుయేషన్ చేసిన అనంతరం తాజాగా అభ్యర్థుల మార్కుల వివరాలను విడుదల చేశారు.  త్వరలోనే గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఫలితాలు, హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్స్‌ పోస్టులు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్‌ ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేయనుంది.