Delhi Liquor Scam :   ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనువాసులు కొడుకు మాగుంట రాఘవ అఫ్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అఫ్రూవర్‌గా మారడానికి మాగుంట రాఘవ చేసుకున్న దరఖాస్తును తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో మాగుంట రాఘవ అఫ్రూవర్‌గా మారారు. ఈ కేసులో జైలుకెళ్లిన మాగుంట రాఘవ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. రాఘవతో పాటు ఈ కేసులో మరో కీలక నిందితుడు దినేష్ ఆరోరా అఫ్రూవర్‌గా మారడాన్ని కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. 


ఇప్పటికే మాగుంట శ్రీనివాసులరెడ్డి అప్రూవర్  


ఇంతకు ముందే ఈ కేసులో మాగుంట రాఘవ తండ్రి..   వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అఫ్రూవర్ గా మారారు.   ఇ  ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే  20 మంది నుండి కీలక సమాచారం సేకరించింది ఈడీ.  హైద్రాబాద్ నుండి ఢిల్లీకి నగదు బదిలీపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు.మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన సమాచారంతో  పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విషయమై  ఈడీ అధికారులు దర్యాప్తులో మరింత దూకుడును పెంచింది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలు అఫ్రూవర్ గా మారారు.ఈ కేసులో మాగుంట రాఘవ, శరత్ చంద్రారెడ్డిలు బెయిల్ పై ఉన్నారు.
మాగుంట రాఘవ బెయిల్‌ మంజూరైంది. వైద్య కారణాలతో రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా.. చెన్నై లేదా దిల్లీ కార్యాలయంలో వారి ఎదుట హాజరుకావాలని కోర్టు ఆయన్ను ఆదేశించింది. చెన్నైకే పరిమితం కావాలన్న న్యాయస్థానం.. ప్రతి మంగళ, శుక్రవారాల్లో సాయంత్రం 4గంటలకు ఈడీ ఎదుట రిపోర్టు చేయాలని సూచించింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని.. పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. 


కవిత తప్ప సౌత్ లాబీలో అందరూ అప్రూవర్లే ? 


సౌత్ లాబీలో ఒక్క కవిత తప్ప అందరూ అప్రూవర్లుగా మారారు. కవిత తనను ఈడీ విచారణను పిలవడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో  కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది.  ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసింది. అక్టోబర్ 18న పిఎంఎల్‌ఎ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ తెలిపారు. ఈ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై విచారణ చేపడతామన్నారు. అయితే అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 
సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎంఎల్‌సి కవితను విచారణకు పిలవబోమని ఇడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నారనేది పక్కనబెడితే అసలు విచారణకు పిలవద్దంటే ఎలా? అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అన్నారు. అ


కవితను విచారణకు పిలువకుండా రెండు నెలలు ఊరట 


ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసినట్లు తెలిపారు. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు రావాలంటూ ఇడి జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇడి నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. నళిని చిదంబరం కేసులో మాదిరి ఉపశమనం కోరుతున్నానన్నారు. మహిళల విచారణకు సంబంధించిన మార్గదర్శకాలపై కూడా స్పష్టత చేయాలని కోర్టును కవిత కోరారు