Cheetahs in India:



సౌతాఫ్రికా నుంచి మరో 12 చీతాలు భారత్‌కు చేరుకున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో వీటిని తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చేరుకున్నాయి. వీటిని నేరుగా కునో నేషనల్ పార్క్‌కు చేర్చుతారు. ఈ 12 చీతాల్లో 7 మేల్, కాగా మిగతా 5 ఫిమేల్. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు వచ్చాయి. రెండో విడతలో 12 చీతాలను దిగుమతి చేసుకున్నారు. "సౌతాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో 12 చీతాలు తీసుకొచ్చాం. గ్వాలియర్ ఎయిర్‌పోర్ట్‌లో 10 గంటలకు చేరుకున్నాయి" అని అధికారులు వెల్లడించారు. కునో నేషనల్ పార్క్‌కు చేరుకున్నాక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వాటిని క్వారంటైన్‌లోకి వదలనున్నారు. చీతాల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ స్పెషల్‌ టీమ్‌ని ఏర్పాటు చేసింది కేంద్రం.