Ludhiana couple LipLocks : ప్రేమించుకుంటే విపరీత పోకడలకు పోవడం ఇప్పటి స్టైల్ అనుకుంటున్నారు. సినిమాల్లో చూపిస్తున్న విధంగా బైక్‌పై ఎదురెదురుగా కూర్చుని ముద్దులు పెట్టుకోవడం.. ఎక్కడ పడితే అక్కడ ఎవరైనా ఉన్నారని కూడా చూడకండా అసభ్యంగా ప్రవర్తించడం ప్రేమ అనుకుంటారు. అలాగే లూధియానాలో ఓ జంట కారుపైకి ఎక్కి కూర్చుని మద్దులాట పెట్టుకున్నారు. కారు రోడ్లపై వెళ్తూంటే.. తమ పని తాము చేసుకున్నారు.
లుధియానా, పంజాబ్‌లోని ప్రధాన నగరాల్లో ఒకటి. ఆ నగరంలో ఓ కారులో సన్‌రూఫ్‌ను తెరిచి బయటకు వచ్చిన కపల్, రోడ్డు మధ్యలోనే ఒకరికొకరు గట్టిగా హగ్ చేసుకుని, లిప్‌లాక్ చేసుకుంటూ వెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన సమీపంలో ఉన్న వాహనాల్లో ఉన్న వ్యక్తులు షాక్ అయ్యారు. వీరిలో ఒకరు ఈ ఘటనను మొబైల్‌తో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో అంతా వైరల్ అయింది.
అయితే వీరు ఇండియన్స్ కాదని.. ఆఫ్రికన్లు అని అంటున్నారు. ఉగాండా నుంచి వచ్చిన విదేశీ విద్యార్థులని.. వీరు పంజాబ్‌లో చదువుకోవడానికి వచ్చి, లుధియానాలోని బీఆర్‌ఎస్ నగర్ సమీపంలోని లాల్‌బాగ్ ప్రాంతంలోని PG హాస్టల్‌లో ఉంటున్నారని గుర్తించారు. ఈ వీడియోకు సంబంధించి లుధియానా పోలీసులు ఇంకా స్పందించలేదు, కానీ నెటిజన్లు "చట్టపరమైన చర్యలు తీసుకోవాలి" అంటూ డిమాండ్ చేస్తున్నారు.
దిల్లీ మెట్రోలో కూడా అలాంటి ఘటనలు పెరగడంతో, DMRC హెచ్చరికలు జారీ చేసింది. ట్రోలింగ్, విమర్శలు ఉన్నప్పటికీ, ఈ ట్రెండ్ ఆగడం లేదు. నిపుణులు "పబ్లిక్ PDA సాంస్కృతికంగా, చట్టపరంగా సమస్యలు తీసుకొస్తుంది" అంటున్నారు.