Security Breach Lok Sabha:


సభలో అలజడి..


లోక్‌సభలో ఇద్దరు (Lok Sabha Security Breach Live) ఆగంతకులు దూసుకురావడం అలజడి సృష్టించింది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ భద్రతా వైఫల్యంపై (Security Breach in Lok Sabha) పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు సూచించినట్టు తెలిపారు. ఈ ఘటన తరవాత సభ తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలోనే స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


"జీరో అవర్‌లో జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించాం. ప్రస్తుతం ఆ విచారణ కొనసాగుతోంది. తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు సూచించాం. ఆ ఆగంతకులు సభలో వదిలిన గ్యాస్ ప్రమాదకరమైంది కాదని ప్రాథమిక విచారణలో తేలింది. దీని గురించి భయపడాల్సిన పని లేదు"


- ఓం బిర్లా, లోక్‌సభ స్పీకర్