Lok Sabha Elections 2024: మరి కొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. అటు ఎన్నికల సంఘం కూడా ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ కీలక విషయాలు వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. 


 






ఈ క్రమంలోనే ఒడిశా ఎన్నికల గురించి మాట్లాడారు రాజీవ్ కుమార్. దాదాపు 50% మేర పోలింగ్‌ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు వెల్లడించారు. దివ్యాంగులు, మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు.


"ఒడిశాలోని 50% మేర పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పిస్తాం. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 37809 పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తాం. అందులో  22,685 బూత్‌లలో వెబ్‌కాస్టింగ్  సౌకర్యం ఉంటుంది. దివ్యాంగులు, మహిళలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 300 పోలింగ్‌ బూత్‌లను దివ్యాంగులే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం"


-సీఈసీ రాజీవ్ కుమార్