Lok Sabha Elections 2024 Schedule Details: లోక్‌సభ ఎన్నికలను (Lok Sabha Elections 2024) మొత్తం 7 దశల్లో నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే విధంగా 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఇందులో మార్పులు ఉండొచ్చు అని భావించినా అదేమీ లేదని క్లారిటీ వచ్చింది. ఏప్రిల్ 19న ఈ ఎన్నికల ప్రక్రియ (Lok Sabha Elections 2024 Schedule) మొదలై...జూన్ 1వ తేదీన ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ ఎన్నికల ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్టు ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా ఏయే దశలో ఎప్పుడు పోలింగ్‌ జరుగుతుందో తేదీలు (Lok Sabha Elections Polling Dates) ప్రకటించింది. ఇందులో కొన్ని రాష్ట్రాలకు పలు విడతల్లో (Lok Sabha Elections Phases) పోలింగ్ జరగనుంది. 


ఏయే దశలో ఎక్కడెక్కడ పోలింగ్..?



  • మొదటి దశ ఏప్రిల్ 19న మొదలు కానుంది. ఈ తేదీన మొత్తం 21 రాష్ట్రాల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిమ్, తమిళనాడు, త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాని నికోబార్, జమ్ముకశ్మీర్ లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. 

  • ఏప్రిల్ 26వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఈ జాబితాలో అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జమ్ముకశ్మీర్‌ ఉన్నాయి. 

  • మే 7వ తేదీన మూడో దశ పోలింగ్ జరగనుంది. మొత్తం 12 రాష్ట్రాల్లోని 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ జాబితాలో అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర,యూపీ, వెస్ట్ బెంగాల్, దద్రా  నగర్ హవేలీ, దమన్ అండ్ దియు, జమ్ముకశ్మీర్‌ ఉన్నాయి. 

  • మే 13న నాలుగో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. 10 రాష్ట్రాల్లోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇదే రోజున ఏపీ, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, యూపీ, వెస్ట్ బెంగాల్, జమ్ముకశ్మీర్‌లో పోలింగ్ జరగనుంది. 

  • ఇక ఐదో దశ పోలింగ్ మే 20 వ తేదీన జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాలు ఎన్నికలకు వెళ్లనున్నాయి. బిహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, వెస్ట్ బెంగాల్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 

  • మే 25న 7 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో ఆరో దశ పోలింగ్‌ని షెడ్యూల్ చేసింది ఎన్నికల సంఘం. బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, యూపీ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 

  • ఇక చివరగా జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగున్నాయి. బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, పంజాబ్, యూపీ, ఛండీగఢ్‌లో పోలింగ్ జరగనుంది.  


 Also Read: Lok Sabha Election 2024: హద్దులు దాటితే ఊరుకోం, రాజకీయ పార్టీల ప్రచారంపై ఈసీ వార్నింగ్