Election Results 2024: రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్లా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. కేరళలోని వయనాడ్‌తో పాటు, యూపీలోని రాయ్‌బరేలీలో రాహుల్ పోటీ చేశారు. వయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాహుల్ ప్రస్తుత ట్రెండ్‌లో లక్షా 43 వేల ఓట్లకు పైగా లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడ సీపీఐ తరపున సీనియర్ నేత అన్నీ రాజా పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలోనూ రాహుల్ లీడ్‌లో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై లక్షా 47 వేల ఓట్లకు పైగా ముందంజలో ఉన్నారు. ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కి కంచుకోట లాంటివే. వయనాడ్‌లో రాహుల్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. అటు రాయ్‌బరేలీ ఓటర్లు ఎప్పటి నుంచో కాంగ్రెస్‌కే మొగ్గు చూపుతున్నారు.
అంతకు ముందు ఈ స్థానంలో సోనియా గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే...ఆమె ఆరోగ్య సమస్యల వల్ల ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరవాత రాయ్‌బరేలీలో ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది. దీనిపై చాలా రోజుల పాటు ఎటూ తేల్చని కాంగ్రెస్ చివరకు రాహుల్ గాంధీ పేరుని ప్రకటించింది. ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా..రాహుల్ పేరునే ఖరారు చేశారు. కచ్చితంగా రాహుల్ గెలుస్తారని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేశాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితాల ట్రెండ్ కనిపిస్తోంది.