Election Results 2024: ఈశాన్య రాష్ట్రాల్లోని 25 ఎంపీ స్థానాల్లో బీజేపీ 11 చోట్ల లీడ్‌లో దూసుకుపోతోంది. అసోంలో 14 నియోజకవర్గాల్లో బీజేపీ ఆరు చోట్ల లీడ్‌లో ఉంది. అటు అరుణాచల్ ప్రదేశ్‌లోని రెండు స్థానాల్లోనూ బీజేపీ లీడ్‌లో ఉంది. మణిపూర్‌లో రెండు ఎంపీ స్థానాలుండగా అందులో ఓ చోట బీజేపీ లీడ్‌లో ఉంది. ఇక త్రిపురలోనూ రెండు చోట్ల దూసుకుపోతోంది. అటు కాంగ్రెస్ విషయానికొస్తే 25 ఎంపీ స్థానాల్లో 5 చోట్ల లీడ్‌లో ఉంది. నాగాలాండ్‌లో ఉన్న ఒక్క ఎంపీ స్థానంలోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. అసోంలోని లఖింపూర్, దిబుర్‌ఘర్, గువాహటి, కజిరంగ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్‌లో ఉన్నట్టు ప్రస్తుత ట్రెండ్ చెబుతోంది.
Lok Sabha Election Results 2024: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీదే హవా, ప్రస్తుత ట్రెండ్‌లో లీడ్‌లో కాషాయ దళం
Ram Manohar | 04 Jun 2024 10:11 AM (IST)
Lok Sabha Election Results 2024: ఈశాన్య రాష్ట్రాల్లోని 25 ఎంపీ స్థానాల్లో 11 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో దూసుకుపోతోంది.
ఈశాన్య రాష్ట్రాల్లోని 25 ఎంపీ స్థానాల్లో 11 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో దూసుకుపోతోంది.