Liquor Policy Case:


కస్టడీ పూర్తి..


లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. శనివారం (మార్చి 4)వ తేదీన దీనిపై విచారణ చేపట్టనుంది కోర్టు. అదే రోజున సీబీఐ కస్టడీ ముగియనుంది. ఇప్పటికే డిప్యుటీ సీఎం పదవికి రాజీనామా చేశారు సిసోడియా. ఆయనను శనివారం రౌజ్ అవెన్యూ కోర్టులో మరోసారి హాజరు పరచనున్నారు సీబీఐ అధికారులు. అయితే అంతకు ముందు సిసోడియా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. CBI అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సూచించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. హైకోర్టులో ప్రత్యామ్నాయ మార్గాలు దొరికే అవకాశముందని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్‌ విచారించడం కుదరదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ డీపై చంద్రచూడ్. ఈ మేరకు తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆప్ తెలిపింది. 






సుప్రీంకోర్టులో తిరస్కరణ..


తనిఖీల్లో ఎలాంటి నగదు దొరకలేదని, ఛార్జ్‌షీట్‌లోనూ ఆయన పేరు లేదని సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకి తెలిపారు. అయితే...ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బిజీగా ఉంటున్నారని వివరించారు. ఆయనే ట్రిబ్యునల్ విధులూ నిర్వర్తిస్తున్నారని చెప్పారు. సిసోడియా అరెస్ట్‌ను తప్పు పట్టారు సింఘ్వీ. అయితే...సుప్రీంకోర్టు మాత్రం "మీరేం చెప్పినా హైకోర్టులోనే చెప్పుకోండి. మేం ఈ పిటిషన్‌ను విచారించలేం" అని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తామని, హైకోర్టుకు వెళ్తామని ఆప్ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ సిసోడియాపై ఆరోపణలు చేస్తోంది CBI.ఇప్పటికే ఆయనను రెండు సార్లు విచారించింది. ఇటీవలే ఆయనను 8.5 గంటల పాటు విచారించిన అధికారులు తరవాత అరెస్ట్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, అందుకే అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఆ తరవాత కోర్టులోనూ హాజరు పరిచారు. రౌస్ అవెన్యూ కోర్టులో CBI అధికారులు,సిసోడియా తరపున న్యాయవాది తమ తమ వాదనలు వినిపించారు. కచ్చితంగా అవకతవకలు జరిగాయని CBI చెబుతుంటే...అలాంటిదేమీ లేదని సిసోడియా తరపున న్యాయవాది వాదించారు. చివరకు 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. లిక్కర్‌ పాలసీలో కచ్చితంగా స్కామ్ జరిగిందని, అది కూడా చాలా సైలెంట్‌గా, ప్లాన్డ్‌గా చేశారని తేల్చి చెప్పింది. అంతే కాదు. సిసోడియాను A-1గా వెల్లడించింది. 


Also Read: Jyotiraditya Scindia: కాంగ్రెస్ ఓటమికి రాహులే కారణం, జోడో యాత్రను ఎవరూ పట్టించుకోలేదు - రాహుల్‌పై సింధియా ఫైర్