Woman Kept As Slave For 4 Years : ఆన్ లైన్ డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యాడు. అందగాడు.. సౌమ్యుడు.. డబ్బులు అంతంతమాత్రమే అయినా సరే.. అతనితో జీవించాలని అనుకుంది. అతని కోసం వెళ్లింది. మళ్లీ ఎవరికీ కనిపించలేదు. నాలుగేళ్ల తర్వాత చావుబతుకుల్లో ఓ ఆస్పత్రి బెడ్ పై కనిపించింది. పక్కన బెడ్ పై ఉన్న రోగికి తన దీన స్థితి గురించి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 


పోలండ్‌కు చెందిన మాల్గోరట్జా అనే యువతి నాలుగేళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో పరిచయమైన మాటేసుజ్ అనే యువకుడితో కలిసి ఉంటానని చెప్పి వెళ్లింది. అయితే నాలుగేళ్ల వరకూ ఎవరికీ కనిపించలేదు. ఇటీవల ఆమె ఓ ఆస్పత్రిలో అత్యంత దుర్భరమైన ఆరోగ్య పరిస్థితుల్లో కనిపించింది. ఆమె తన స్టోరీని పక్కనున్న రోగికి చెప్పడంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి ఆమె దగ్గర అదనపు వివరాలు తీసుకున్నారు. ఆమె చెప్పిన వివరాలు చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె పెదాలను..  కత్తిరించడంతో పాటు.. పళ్లను కూడా ఊడబికీనట్లుగా డాక్టర్లు గుర్తించారు. 


సెలవుల్లేకుండా 104 రోజుల డ్యూటీ - చనిపోయిన ఉద్యోగి - చైనాలో ఇలాంటివి మామూలేనా ?


మాల్గొరట్టా తన బాయ్ ఫ్రెండ్ తో జీవించేందుకు వచ్చిన తర్వాత కానీ అసలు విషయం తెలియలేదు. ఆమె వచ్చిన తర్వాత బాయ్ ఫ్రెండ్ మాటేనుజ్.. తన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఆమెను ఓ చీకటి గదిలో బంధించాడు. అక్కడ ఎంత దుర్భంగా ఉండేదంటే..  రాత్రో.. చీకటో తెలిసేది కాదు. ఆహారం, మంచినీళ్లు ఎప్పుడిస్తారో తెలియదు. కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి శరీరాన్ని మాత్రం అనుభవించేవాడు. ఇలా నాలుగేళ్ల పాటు సాగింది. మధ్యలో ఆమె ఓ సారి గర్భం దాల్చింది. బిడ్డ పుట్టిన వెంటనే వేరే వారికి దత్తత ఇచ్చేలా ఆ క్రూర ప్రియుడు ఏర్పాటు చేశాడు. ఓ సారి చేయి.. మరోసారి కాలు విరిగితే ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయించారు. కానీ ఇతరులతో మాట్లాడే  ధైర్యం చేయలేకపోయారు. 


తన జీవితంపై ఎంతో విరక్తి చెందిన ఆమె.. మరోసారి అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ధైర్యం చేసింది. తన దుస్థితిని వివరించింది. పక్క రోగి  సాయంతో ఆమె ఎలాగోలా బయటపడింది. ఇప్పుడు ఆ  క్రూర ప్రియుడ్నిపోలీసులు అదుపులోకి  తీసుకున్‌నారు. ఇతరులకు సమాచారం లేకుండా .. రాకుండా ఆమెను అత్యంత కఠిన పరిస్థితుల్లో బంధించినట్లుగా ఒప్పుకున్నారు. అయితే ఆ క్రూర ప్రియుడు తల్లిదండ్రులు మాత్రం మాకేం తెలియదని.. తన కొడుకు ఇలా చేస్తాడని ఊహించలేదంటన్నారు. పోలీసులు వారికి కూడా తెలుసేమో అన్న అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు. 


కార్గిల్ కుట్ర తమ పాపమేనని అంగీకరించిన పాకిస్థాన్ - మొదటి సారి ఆర్మీ చీఫ్ ఒప్పుకోలు


ఈ పోలెండ్ యువకుడి  వ్యవహారం ఆ దేశంలో సంచలనం సృష్టించింది. డేటింగ్ యాప్ లను నమ్ముకుని వెళ్తే ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అక్కి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.