Olympic Winner Gifts Neeraj Chopra :  ఆటల్లో గెలిచిన వారికి పెద్ద ఎత్తున బహుమతులు ఇవ్వడం సంప్రదాయం. ఒలింపిక్స్ లాంటి ఆటల్లో గెలిచిన వారికయితే ప్రభుత్వాల దగ్గర నుంచి బంధుమిత్రుల వరకూ అనేక బహుమతులు ఇస్తూంటారు. 


పాకిస్తాన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌కు గేదె బహుమతిగా ఇచ్చిన మామ               


పారిస్ ఒలింపిక్స్ లో  జావెలిన్ త్రోలో గోల్డ్ గెలిచిన పాకిస్తాన్ ప్లేయర్ నదీమ్ ఆర్షద్‌కు ఆయన మామ ఓ గెదెను బహుుమతిగా ప్రకటించడం వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలోనూ మీమ్స్ వచ్చాయి. అయితే  నదీమ్ స్వగ్రామంలో ఇలా గేదెను  బహుమతిగా ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తారు. ఈ విషయం తెలిసిన తర్వాత నదీమ్ తన మామపై సెటైర్లు వేశారు. కనీసం ఐదు ఎకరాల భూమి అయినా ఇవ్వాల్సిందని తన భార్యతో చెప్పానన్నారు.          


నదీమ్ గేదె గిఫ్టు గురించి వైరల్ అయిన అంశంపై 2019 ఒలింపిక్స్ జావెలిన్ త్రో విజేత నీరజ్ చోప్రాకూ.. ఇలాంటి విచిత్రమైన  బహుమతులు వచ్చాయా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు మీడియా ఇలాంటి ప్రశ్నలే అడిగింది. ఈ ప్రశ్నలకు నీరజ్ చోప్రా ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. తాను ఒలిపింక్ గోల్డ్ గెలిచినప్పుడు తన స్వగ్రామంలోని  వారు .. దేశీ నెయ్యిని  బహుమతిగా పంపారని గుర్తు చేసుకున్నారు. 


వేల కోట్లకు పడగలెత్తిన ఈ పారిశ్రామికవేత్తలు ఒకప్పుడు చిరుద్యోగులు - ఏ ఉద్యోగాలు చేశారో తెలుసా ?


తనకు నెయ్యి  గిఫ్టుగా ఇచ్చారన్న నీరజ్ చోప్రా                                 


యాభై కేజీల వరకూ దేసీ నెయ్యి గిఫ్టుగా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. నదీమ్ స్వగ్రామంలో గేదెను ఇవ్వడం ఎలా గౌరవమో.. తమ దగ్గర కూడా నెయ్యిని ఇవ్వడం అలాగే గౌరవమని నీరజ్ చెప్పుకొచ్చారు. ఆటల్లో ముందు ఉండే వారికి నెయ్యి ఇస్తారని.. అది తినడం ద్వారా మరింత శక్తిని సమకూర్చుకుంటారని తమ ప్రాంత ప్రజల నమ్మకమని అందుకే గౌరవంగా..  సంప్రదాయంగా నెయ్యిని ఇస్తారని చెప్పుకొచ్చారు. 


2019 ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధించిన నీరజ్ చోప్రా.. ఈ సారి మాత్రం రజత పతకానికే పరిమితమయ్యారు. పాకిస్తాన్ కు చెందిన నదీమ్ గోల్డ్ గెలుచుకున్నారు. ప్రిలిమినరీ పోటీల్లో నీరజ్ కన్నా వెనుకబడిన నదీమ్..  ఫైనల్ లో మాత్రం సర్వశక్తులు ఒడ్డారు. నీరజ్ కన్నా రెండు మీటర్లు ఎక్కువ దూరం విసిరి పసిడిపట్టారు. పాకిస్తాన్ లో ఇప్పుడు ఆయనొక హీరో.  


నదీమ్‌ను నీరజ్ కూడా అభినందించారు.  నదీమ్ కూడా.. నీరజ్ ను గౌరవిస్తారు. ఇద్దరూ మంచి మిత్రులుగా ఉన్నా.. ఆటలో మాత్రం..  మరికొన్నేళ్ల పాటు ప్రధాన ప్రత్యర్థులుగా ఉండనున్నారు.                  


మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? మిమ్మల్ని క్రెడిట్ కార్డు వాడుకుంటోందా ?