First Job Of Most Successful Indians : ఇప్పుడంతా స్టార్టప్‌లమయం. ఒక్క ఐడియాతో ఐదేళ్లలో వేల కోట్ల వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. అదే కాలంలో వేల కోట్ల వ్యాపారాన్ని నేల పాలు చేసుకోవచ్చు కూడా. కానీ తొలి తరం పారిశ్రామిక వేత్తలు మాత్రం ఇటుక మీద ఇటుక వేసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించారు. అలా వ్యాపారాల్లోకి రాక ముందు చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు. వారు చేసిన ఉద్యోగాలేంటో చూద్దాం.
ధీరూబాయ్ అంబానీ
ఇప్పుడున్న రిలయన్స్ సామ్రాజ్యానికి పునాది వేసిన పారిశ్రామిక వేత్త థీరూబాయ్ అంబానీ. ఆయన పుట్టుకతో శ్రీమంతుడు కాదు. ఆయన చిరు ఉద్యోగాలు చేసి తర్వాత వ్యాపారాలు ప్రారంభించారు. 17 ఏళ్ల వయసులో మొదట పెట్రోల్ బంకులో పని చేశారు. దానికి కొంత వేతనం అందుకున్నారు. తర్వాత అనుభవం కోసం జీతం తీసుకోకండా కొన్ని చోట్ల పని చేశారు. తర్వాత మళ్లీ మూడు వందల రూపాయల జీతంతో పెట్రోల్ బంకులో చేరారు. అదే ఆయన మొదటి ఉద్యోగం.. జీతం. ఇప్పుడు రిలయన్స్ సామ్రాజ్య విలువ ఎన్ని లక్షల కోట్లో చెప్పాల్సిన పని లేదు.
కిరణ్ మజుందార్ షా
బయోకన్ చైర్మన్ కిరణ్ మజుందార్ షా చదువు అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాలోని ఓ బ్రూవరీస్ కంపెనీలో ట్రైనీ బ్రీవరీగా చేరారు. అక్కడ వివక్ష ఎదుర్కోవడంతో ఇండియాకు వచ్చారు. బయోటెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాల్ని అందిపుచ్చుకుని వేల కోట్ల రూపాయల విలువైన కంపెనీని నిర్మించారు. ఎంతో మందికి కిరణ్ మజుందార్ షా ఓ రోల్ మోడల్.
గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ ఇప్పుడు దేశంలో అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటి. ఈ గ్రూప్ ఫౌండర్ గౌతమ్ అదానీ మొదటగా వజ్రాల రంగంలో ఉద్యోగం చేశారు. డైమండ్స్ సార్టింగ్ చేసే పనిని ముంబైలో ఓ కంపెనీలో చేశారు. కొంత కాలం తర్వాత తనే సొంతంగా వజ్రాల వ్యాపారంలోకి వచ్చారు. తర్వాత విభిన్నమైన వ్యాపారాల్లో అడుగుపెట్టి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు.
ఇంద్రా నూయి
వ్యాపార ప్రపంచంలో ఇంద్రా నూయి గురించి తెలియని వారు ఉండరు. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఈమె బిజినెస్ స్ట్రాటజిస్టుగా మొదట ఉద్యోగం చేశారు. తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్‌లో ప్రొడక్ట మేనేజర్‌గా చేశారు. తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద బ్రాండ్ అయిన పెప్సీకోను నడిపించే స్థాయికి ఎదిగారు.
ఇంకా అనేక మంది పారిశ్రామికవేత్తలు.. తొలిగా ఉ్దయోగాలు చేశారు. అనుభవం సంపాదించుకుని పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు.