Leopard Attack in MP Three Picnickers Injured : పులిని దూరంగా చూసి ఫోటో దిగవచ్చు కానీ ఆ పులితోనే ఆటలాడే ప్రయత్నం చేస్తే వేటాడేస్తది అని సినిమాలో డైలాగ్ కావొచ్చు కానీ నిజంగానూ అదే జరుగుతుంది. ఈ విషయం మధ్యప్రదేశ్‌లో నిరూపితమయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



అటవీ ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్లిన ముగ్గురు స్నేహితులు                  


మధ్యప్రదేశ్ లోముగ్గురు స్నేహితులు అటవీ ప్రాంతానికి పిక్నిక్ కు వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే అన్నీ సర్దుకుని సోహాగ్పూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఓ చెట్టు కింద కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ తాము తెచ్చుకున్న తిండి, పానీయాలు సేవించడం ప్రారంభించారు. ఈ ముగ్గురిలో ఓ మహిళ కూడా ఉంది. వారు తెచ్చుకున్నవి తాగేసిన తర్వాత కాస్త కిక్ ఎక్కున తర్వాత దూరంగా పొదల్లో కదలిక కనిపించడంతో అటు చూశారు. 


పొదల్లో చిరుత కనిపించగానే రెచ్చగొట్టిన వైనం          


దూరంగా చిరుత కనిపించింది. మమూలుగా అయితే చిరుతతో గేమ్స్ ఆడకూడదు. కావాలనుకుంటే దూరంగా సెల్ఫీలు తీసుకుని వెళ్లిపోవాలి. కానీ వారికి అప్పటికే కిక్క్ ఎక్కేసిందేమో కానీ.. చిరుతతో పిలుస్తూ పాట అందుకున్నారు. ఆజా అంటూ పాట అందుకుని రీల్స్ చేస్తూండటంతో కాసేపు వెళదామా వద్దా అని  చూసిన చిరిత పిలుస్తున్నందున వెళ్లకపోతే బాగుండని చెప్పి వచ్చేసింది. అది అలా ఇలా కాదు. వేటకు వచ్చేసింది.                                             


పారిపోవడానికి అవకాశం లేనంత వేగంతో దాడి చేసిన  చిరుత           


రెండు అంటే రెండే అంగల్లో వచ్చి వేట ప్రారంభించింది. ఇక వారు ఎలా తట్టుకోగలరు. సీన్ కట్ చేస్తే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ఉన్నారు. చావు బతుకుల్లో ఉన్నారు. వారిని పులి వెటాడిన దృశ్యాలు వైరల్ గా మారాయి.    


చిరుత ఎటాక్ చేసిన సమయంలో కాపాడేందుకు ప్రయత్నంచిన ఓ అటవీ అధికారిణికి కూడా గాయాలయ్యాయి.  వీరిపై పంజా విసిరిన తర్వాత చిరుత ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంగా  అడవిలోకి వెళ్లిపోయింది.                                                     


వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు సహా కీలక సేవలు - మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం