ఉత్తరాంధ్ర అభివృద్ధికి యాభై వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. విశాఖలో జరుగుతున్న ఉత్తరాంధ్ర చర్చా వేదికలో పాల్గొన్న ఆయన... సాగునీటి ప్రాజెక్ట్‌లు, ఆరోగ్యం, విద్యపై మాట్లాడారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వల్ల 8 లక్షలల ఎకరాలు సాగులోకి వస్తాయని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్టు పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. వ్యవసాయ ఆధారితమైన అభివృద్ధే ఉత్తరాంధ్రకు కీలకమన్నారు కొణతాల. 14జీవనదులు ఉన్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్జి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో అన్యాయం జరుగుతోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో 15 నుంచి 20శాతం జనాభా ప్రాతిపదికన ఉత్తరాంధ్ర,రాయలసీమకు కేటాయించాలన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 వేల కోట్లు విడుదల చేయాలి: కొణతాల రామకృష్ణుడు
ABP Desam
Updated at:
07 Jan 2023 11:18 AM (IST)
ఉత్తరాంధ్రకు ఏం కావాలి... అభివద్ధి లేకుండా వెనుకబాటుకు ఉన్న సమస్యలపై చర్చించేందుకు ఉత్తారంధ్ర చర్చా వేదిక సమావేశమైంది.
విశాఖలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక