Weather In Hyderabad Telangana And Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షావరణం ఉంటే తెలంగాణలో మాత్రం ఎముకలు కొరికే చలి ఇబ్బంది పెడుతోంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం చలి తీవ్రత పెరిగింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. అనంతరం ఇది వాయవ్య దిశగా కదులుతుంది. తమిళనాడు శ్రీలంక తీరం వైపునకు వెళ్లి అక్కడ మరింత బలపడబోతోంది. ప్రస్తుత అల్పపీడన ప్రభావం కొంత వరకు కోస్తా ఆంధ్రపై కనిపిస్తోంది. ఆకాశం మబ్బులు పట్టి ఉంది. ఇది వాయుగుండంగా మారితే బుధవారం నుంచి శనివారం వరకు వివిధి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు.
శ్రీలంక సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న అల్పపీడనం దక్షిణ కోస్తాపై ప్రభావం చూపబోతోంది. ఈ సాయంత్రం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాతోపాటు రాయలసీమపై కూడా ప్రభావం ఉంటుంది. వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షాలతోపాటు బలమైన గాలులు కూడా వీస్తాయి. దీంతో చలి తీవ్రత మరింతగా పెరగొచ్చు.
సముద్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు కారణంగా మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. నాలుగు రోజుల పాటు సముద్రంపై అల్పపీడన ప్రభావం తీవ్రంగా ఉంటుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. రైతులు కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 |
కళింగపట్నం
|
29.3 | 17.5 | 78 |
2 |
విశాఖపట్నం
|
30.2 | 22.8 | 64 |
3 |
తుని
|
32.2 | 21.2 | 80 |
4 |
కాకినాడ
|
31.6 | 23.4 | 85 |
5 |
నర్సాపురం
|
32.8 | 21 | 73 |
6 |
మచిలీపట్నం
|
32 | 22.6 | 90 |
7 |
నందిగామ
|
31.5 | 17.5 | 84 |
8 |
గన్నవరం
|
31 | 20.2 | 76 |
9 |
అమరావతి
|
32 | 20.2 | 78 |
10 |
జంగమేశ్వరపురం
|
31.5 | 17 | 84 |
11 |
బాపట్ల
|
31.6 | 19.4 | 86 |
12 |
ఒంగోలు
|
31.4 | 22.6 | 66 |
13 |
కావలి
|
31.6 | 23.4 | 85 |
14 |
నెల్లూరు
|
31.6 | 23.8 | 81 |
15 |
నంద్యాల
|
31.2 | 18.4 | 86 |
16 |
కర్నూలు
|
31.3 | 19.1 | 84 |
17 |
కడప
|
31.4 | 18.5 | 80 |
18 |
అనంతపురం
|
32.5 | 17.9 | 87 |
19 |
ఆరోగ్యవరం
|
28 | 17 | 90 |
20 |
తిరుపతి
|
31.5 | 23.2 | 83 |
తెలంగాణలో వాతావరణం (Telangana Weather):
ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో భిన్నమైన వాతావరణం ఉంది. తెలంగాణ చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని అంటున్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం (Weather Update Hyderabad)
హైదరాబాద్‌లో కూడా చలి పిడుగు భయపెడుతోంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ దారుణంగా పడిపోయాయి. రాత్రి చలి వణికిస్తుంటే ఉదయం పొగమంచు మరింత భయపెడుతోంది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. చలి, పొగమంచు కారణంగా కాలుష్య తీవ్రత కూడా హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిపోయింది.
ప్రాంతం | గరిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | కనిష్ట ఉష్ణోగ్రత (సెల్సియస్‌లో) | తేమ శాతం | |
1 | ఆదిలాబాద్ | 28.8 | 12.8 | 92 |
2 | భద్రాచలం | 30.0 | 18.2 | 91 |
3 | హకీంపేట | 28.2 | 15.2 | 66 |
4 |
దుండిగల్
|
29.8 | 16.0 | 74 |
5 |
హన్మకొండ
|
29.5 | 15.0 | 94 |
6 |
హైదరాబాద్
|
29.0 | 15.7 | 72 |
7 |
ఖమ్మం
|
32.0 | 18.4 | 86 |
8 |
మహబూబ్‌నగర్
|
28.9 | 19.1 | 67 |
9 |
మెదక్
|
29.2 | 11.3 | 66 |
10 |
నల్గొండ
|
28.5 | 19.4 | 74 |
11 |
నిజామాబాద్
|
31.1 | 15.4 | 80 |
12 |
రామగుండం
|
29.0 | 15.7 | 90 |
13 |
పటాన్‌చెరు
|
28.0 | 12.4 | 91 |
14 |
రాజేంద్రనగర్
|
28.5 | 14 | 86 |
15 |
హయత్‌నగర్
|
28.6 | 15.6 | 90 |
Also Read: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?