Papua New Guinea Landslide Death Toll: పపువా న్యూ గినియాలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటి వరకూ 670 మంది మట్టిలో కూరుకుపోయిన మృతి చెందినట్టు International Organisation for Migration వెల్లడించింది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబలి విలేజ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు 150 ఇళ్లు ధ్వంసయ్యాయని లెక్క తేలింది. అంతకు ముందు 60 ఇళ్లు ఇలాగే మట్టిలో కూరుకుపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఆధారంగానే కనీసం 670 మంది మట్టిలో కూరుకుపోయిన చనిపోయినట్టు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం ఐదుగురి (Papua New Guinea landslide) మృతదేహాలు మాత్రమే దొరికాయి. మరో వ్యక్తి కాలు మాత్రమే కనిపించింది. ఇవన్నీ చూసి ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఎక్కడికక్కడ మట్టి పోగవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్స్‌కి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే..మిగతా దేశాల నుంచి మద్దతు తీసుకోవాలా లేదా అనే సందిగ్ధంలో ఉంది. ఒక్కో చోట 20-26 అడుగుల లోతులో కూరుకుపోయిన బాధితులను చాలా శ్రమ పడి కాపాడే ప్రయత్నాలు చేస్తోంది రెస్క్యూ టీమ్. ప్రభుత్వం పలు చోట్ల సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. రోడ్లపైన పెద్ద ఎత్తున మట్టి ఉండడం వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
కాస్తో కూస్తో దారి ఉన్న చోట కొన్ని కాన్వాయ్‌లు (Landslide in Papua New Guinea) బాధితుల కోసం ఆహారం,నీళ్లు సరఫరా చేస్తున్నాయి. కొన్ని చోట్ల గిరిజనులు ఈ కాన్వాయ్‌లపై దాడులు చేస్తున్నారు. వాళ్ల నుంచి తప్పించేందుకు కొంత మంది సైనికులు కాన్వాయ్‌లకు కాపు కాస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదం జరగక ముందు నుంచే ఇక్కడ రెండు తెగల మధ్య ఘర్షణలు జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గొడవల్లో ఓ తెగ వాళ్లు 30 ఇళ్లను కాల్చేశారు. మరి కొన్ని షాప్‌లనూ తగలబెట్టారు. ఇదంతా జరుగుతుండగానే ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఇప్పటి వరకూ కనీసం వెయ్యి మంది గ్రామస్థులు వలస వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. అక్కడి గార్డెన్స్‌తో పాటు వాటర్ రీసోరెస్స్‌పైనా కొండ చరియలు విరిగి పడ్డాయి. ఎక్కడా నిలువ నీడలేకుండా పోయింది. అందుకే రెస్క్యూ టీమ్ వేరే చోటకు తరలిస్తోంది. డెడ్‌బాడీస్‌ని బయటకు తీసేందుకు పెద్ద పెద్ద కర్రలు, ఫోర్క్‌లతో మట్టిని తవ్వుతున్నారు.
Also Read: Viral Video: రొమాంటిక్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన టీచర్, స్టూడెంట్ - క్లాస్‌రూమ్‌లోనే స్టెప్పులు