Lalu Prasad VS BJP: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో భాజపాను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం త్వరలోనే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తానన్నారు. ఈ మేరకు ఆర్‌జేడీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో లాలూ అన్నారు.
నితీశ్ ప్రయత్నాలు
గత నెలలో భాజపాతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ మళ్లీ లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జేడీతో చేరి బిహార్ ముఖ్యమంత్రి అయ్యారు. బిహార్ తర్వాత నితీశ్ కుమార్ ఇప్పుడు భాజపాను కేంద్రం నుంచి గద్దె దించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయన సన్నాహాలు కూడా మొదలుపెట్టారు.
ఇటీవల నితీశ్.. దిల్లీలో పర్యటించి మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. "మేం ఏర్పాటు చేసేది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్" అంటూ నితీశ్ చెబుతున్నారు. ప్రధాని పదవి రేసులో ప్రతిపక్షాల నుంచి నితీశ్ పేరే ఎక్కువగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలను ఆయన తోసిపుచ్చారు. అయితే జేడీయూ, దాని మిత్రపక్షాలు మాత్రం నితీశ్‌ను ప్రధాని పదవి రేసులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో భాజపాయేతర కూటమి గెలిస్తే అన్ని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
" మేము (ప్రతిపక్షం) వచ్చేసారి (కేంద్రంలో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వెనుకబడిన రాష్ట్రాలకు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు? మేము బీహార్ గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇతర వెనుకబడిన రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా సాధించాలి. "
Also Read: National Logistics Policy: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు- ఆ పాలసీకి ఆమోదం!
Also Read: Congress President Polls: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో మరో ట్విస్ట్- అశోక్ గహ్లోత్ ఏమన్నారంటే?