Lakhimpur Horror: ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరి జిల్లాలో దారణ ఘటన జరిగింది. చెరకు పొలంలో ఇద్దరు దళిత బాలికలు చెట్టుకు ఉరివేసుకుని కనిపించడం తీవ్ర కలకలం రేపింది. వీరిద్దరూ అక్కాచెల్లెళ్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302, 376, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.
నిందితులు.. మృతి చెందిన బాలికలకు స్నేహితులని ఎస్‌పీ వెల్లడించారు.
పోస్ట్‌మార్టం
చోటూ మినహా నిందితులందరూ లఖింపుర్ ఖేరిలోని లాల్‌పుర్ గ్రామానికి చెందినవారని తెలుస్తోంది. చోటూ ఇల్లు బాలికల ఇంటి దగ్గరే. అతనే బాలికలను.. ఈ నిందితులకు పరిచయం చేశాడని ఎస్‌పీ తెలిపారు.
ఇదీ జరిగింది
లఖింపుర్ ఖేరి జిల్లాలోని నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న చెరుకు తోటలో ఇద్దరు దళిత అక్కాచెల్లెళ్లు చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు.
అయితే ఆ ఇద్దరు బాలికల తల్లి వారిని హత్య చేశారని ఆరోపించారు. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొరుగు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని అపహరించి హత్యాచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read: Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్, ‘ఇది న్యాయాన్ని అవహేళన చేయ్యడమే’
Also Read: Chintu Cheetah: ఇండియాకు వస్తున్న ఆఫ్రికన్ చీతా, ప్రధాని మోదీ బర్త్‌డే స్పెషలా?